Home /News /telangana /

THREE HANDLOOM WEAVERS FROM SIDDIPET DISTRICT AWARDED BY STATE GOVERNMENT FOR GOLLABHAMA TYPE SAREES SNR MDK

Telangana : గొల్లబామ చీరల ప్రత్యేకతే వేరు .. అరుదైన గౌరవం దక్కించుకున్న ముగ్గురు నేతన్నలు

(Handloom Weavers)

(Handloom Weavers)

Telangana : తెలంగాణ నేతన్నల చేతివృత్తికి..వారిలోని సృజనాత్మకకు అరుదైన గుర్తింపు, గౌరవం దక్కింది. గొల్లభామ పేరుతో తయారు చేసిన వెరైటీ డిజైనర్ శారీస్‌కు ఇప్పుడు అవార్డులు దక్కాయి. తమకు దక్కిన గుర్తింపుకు సిద్దిపేట జిల్లాలోని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet, India
    (K.Veeranna,News18,Medak)
    తెలంగాణ(Telangana)లోని చేనేత కార్మికుల నైపుణ్యం, వారిలోని సృజనాత్మక కళ అందర్ని ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లలో చీరలు నేస్తూ మహిళల మనసులు దోచుకుంటూనే ఇప్పుడు అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నారు. సిద్దిపేట(Siddipet)జిల్లాలోని నేతన్నలు కుచ్చిళ్ల నుంచి కొంగు వరకు వినూత్న డిజైన్లలో గొల్లభామ(Gollabhama)అనే రకం చీరలను నేస్తూ భళా అనిపించుకుంటున్నారు. జిల్లాలోని పలువురు చేనేత కార్మిక(Handloom weavers)నేస్తున్న పట్టుచీరలు (Silk Sarees)అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పట్టుచీరలపై ఒదిగిన డిజైన్లను చూస్తే వారిని నేత కార్మికులని కాదు నేత కళాకారులు అనాల్సిందే.

    Karimnagar: కరీంనగర్​ కళాకారుడి అద్భుతం.. బియ్యపు గింజపై జాతీయ పతాకం.. ఈకపై దేశ పటం.. 


    నేతన్నలకు అవార్డులు..
    తెలంగాణలోని సిరిసిల్ల, సిద్దిపేట చేనేత కార్మికులు, నేతన్నలకు ప్రసిద్ధి. ఇటీవల సిరిసిల్లకు చెందిన నేతన్న సువాసనలు వెదజల్లే చీరను నేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. తాజాగా సిద్దిపేట జిల్లాకు చెందిన చేనేత కార్మికులు గొల్లభామ అనే కొత్తరకం చీరలను నేసి ఔరా అనిపించుకున్నారు. గొల్లభామ రకం చీరల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలాంటి నేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందజేస్తుంది. ఈసారి సిద్దిపేటకు చెందిన ముగ్గురు చేనేత కళాకారులకు ఈ రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది.



    గొల్లభామ చీరల స్పెషాలిటీ..
    సిద్దిపేట ఆదర్శ చేనేత సహకార సంఘం నేత కార్మికుడు పత్తిపాక ఎల్లయ్య అనే నేతన్న రామప్ప ఆలయం నృత్య శిలలను పట్టుచీరపై రూపొందించారు. అలాగే ఇర్కోడు చేనేత సహకార సంఘానికి చెందిన వీరబత్తిని శివరాజం సైతం గొల్లభామ పట్టుచీరకు తన కళాత్మక నైపుణ్యం జోడించి అందర్ని మనసుల్ని ఆకట్టుకుంటున్నారు. కాళ్లకుంటకాలనీకి చెందిన వేముల దేవదాసుకు ఈ గౌరవం దక్కింది. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమం వారు ఈ పురస్కారాన్ని అందుకోనున్నట్లు చేనేత సహకార సంఘాల జిల్లా అధికారి సంతోష్‌కుమార్ తెలిపారు. ముగ్గురు నేత కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించనుందని ఆయన వెల్లడించారు.

    సిద్దిపేట నేతన్నల ఘనత..
    యునెస్కో గుర్తింపు దక్కించుకున్న రామప్ప ఆలయం నమూనాను పట్టుచీరలపై నేయడం నాకు లభించిన అవకాశం అదృష్టంగా భావిస్తున్నట్లు నేతన్న తెలిపారు. చీర నేసేటప్పుడు అనేక సందేహాలు వచ్చినప్పటికీ పట్టుచీర నేసి తీరాను. ప్రభుత్వం గుర్తిస్తుందని అనుకోలేదు. స్థానిక అధికారుల సహకారంతో తోటి కార్మికుల సలహాలతో రోజుకు సుమారు మూడు చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని వినూత్నమైన పట్టుచీరలు నేసేందుకు కృషి చేస్తానని పత్తిపాక ఎల్లయ్య తెలిపారు.

    TSRTC Tiranga Rally: హైదరాబాద్ రోడ్లపై నిజాం కాలం నాటి బస్సు.. ఆర్టీసీ తిరంగ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్.. ఇదిగో వీడియో



    సర్కారు ప్రోత్సాహం కోరుతున్న నేతన్నలు..
    సిద్దిపేట ప్రాంతం చీరలు నేయడంలో నైపుణ్యం గల కార్మికులు ఇంకా చాలా మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సబ్సిడీ సహకారాలు అందిస్తే బాగుంటుంది. అవార్డు తీసుకోవడం మరింత ఉత్సాహాన్ని నింపింది.గొల్లభామ ప్రతిమలతో పట్టుచీరనేసే అవకాశం నాకు లభించడం సంతోషంగా ఉందంటున్నారు ఇందిరనగర్‌కు చెందిన వీరబత్తిని శివరాజం. రాష్ట్ర ప్రభుత్వం మరింత సహకారం, ప్రోత్సాహకం అందిస్తే చేనేత కార్మికుల జీవితాలు మారుతాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఫించన్‌తో పాటు ముడిసరుకులకు సబ్సిడీ సహాకారం అందిస్తే బాగుంటుందంటున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Handloom saree, Siddipet, Telangana News

    తదుపరి వార్తలు