THREE FAMILY MEMBERS HAVE DIED THE SAME DAY WITH CORONA IN NARAYANAPET DISTRICT OF TELANGANA VRY
Corona Deaths : తెల్లవారుజామున తల్లి, ఉదయం కొడుకు, మధ్యాహ్నం భర్త ..ముగ్గురు ఒకేరోజు మృతి
Corona Deaths : తెల్లవారుజామున తల్లి, ఉదయం కొడుకు, మధ్యాహ్నం భర్త ..ముగ్గురు ఒకేరోజు మృతి
Corona Deaths : ఒకే కుటుంబం ముగ్గురిని కోల్పోయింది..అదికూడ ఒకేరోజు ఒకరి తర్వాత ఒకరు కరోనాతో ప్రాణాలు కొల్పోయారు..దీంతో ఆ కుటుంబలో వర్ణించలేని విషాదచాయలు అలుముకున్నాయి..ముగ్గురు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో కూడా కరోనా భయాందోళనలు అధికమయ్యాయి.
కరోనా ఎన్ని కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేస్తోంది..ఉహకందడం లేదు..కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నాదమ్ములు, తల్లి కొడుకులు ఇలా ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు కరోనా బారిన పడి ప్రాణాలు కొల్పోతున్న దయనీయ స్థితి నెలకొంది..దీంతో కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతుండగా చాల మంది పిల్లలు తల్లి దండ్రులను కోల్పోతుండడంతో అనాథాలుగా మిగులుతున్నారు..
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓకే రోజు ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన విషాద ఘటన తెలంగాణ జిల్లాల్లో చోటు చేసుకుంది..ఒకరి తర్వాత ఒకరు కరోనాతో మృత్యువాత పడడం గ్రామంలో భయాన్ని నెలకోల్పింది. ఉదయం రాత్రి ఒకరు ,తెల్లవారు జామున మరొకరు మధ్యాహ్నం మరొకరు ఇలా ముగ్గురు ఒకే సారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో చెప్పలేని దు:ఖం నిండుకుంది..
వివరాల్లోకి వెళితే..నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగిలిమడకకు చెందిన ఓకే కుటుంబంలో ముందుగా తల్లి, ఆ తర్వాత కొడుకు ..అనంతరం తండ్రి కొద్ది గంటల వ్వవధిలోనే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు..కాగా గ్రామంలో భద్రయ్య ఆయన కొడుకు శంభులింగంలు ఆర్ఎంపీలుగా గ్రామానికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా శంభులింగం కరోనా భారిన పడడంతో మే 24న మహబుబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు..అయితే కొడుకు చికిత్స పొందుతుండగానే తండ్రి భద్రయ్య తల్లి శశికళకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారు కూడ మే 30న అదే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే ముగ్గురు కరోనా భారిన పడడమే కాకుండా వారిని విధి వక్రీకరించింది..చికిత్స పొందుతున్న ముగ్గురిలో తల్లి శశికళ ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందగా..ఉదయం పది గంటల సమయంలో కుమారుడు శంభులింగం కూడ మరణించాడు. కరోనాతో మృతి చెందడంతో ఉదయమే తల్లి కొడుకులకు అంత్యక్రియలు నిర్వహించారు..అయితే వీరి చితి మంటలు ఆరకముందే తండ్రి భద్రయ్య సైతం మధ్యహ్నం నాలుగు గంటల సమయంలో మృత్యువాత పడ్డాడు..దీంతో కుటుంబతో పాటు గ్రామంలో విషాద చాయలు నెలకొనడంతో పాటు భయాందోళనలు సైతం పెరిగాయి..ఇక మృతుడు భద్రయ్య దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కూమార్తె ఉండగా శంభులింగం కు ఐదు సంవత్సరాల కొడుకు, మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.