ఎలక్షన్ సీన్... ఒకే ఇంటి నుంచి ముగ్గురు నామినేషన్లు...

తెలంగాణలోని మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు.

news18-telugu
Updated: January 10, 2020, 9:05 PM IST
ఎలక్షన్ సీన్... ఒకే ఇంటి నుంచి ముగ్గురు నామినేషన్లు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తాండూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు ఒకే ఇంటి నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డుకు చెందిన అవిటి శ్రీశైలం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పట్టణంలోని 26 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా శ్రీశైలం తల్లి అవిటి వీరమణి 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. శ్రీశైలం భార్య రాజకుమారి 28వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో శ్రీశైలం భార్య రాజకుమారిని చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ వేయించారు.

తెలంగాణలోని మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. మొత్తం 21,850 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 387, భద్రాద్రిలో 187, జగిత్యాలలో 904, జనగాంలో 207, జయశంకర్ భూపాలపల్లిలో 134, జోగులాంబ గద్వాల జిల్లాలో 294, కరీంనగర్‌లో 564, ఖమ్మంలో 291, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 182, మహబూబాబాద్‌లో 470, మహబూబ్‌నగర్‌లో 624, మంచిర్యాల 910, మెదక్ 554, మేడ్చల్ మల్కాజ్ గిరి 1910, నాగర్ కర్నూలు 452, నల్లగొండ 1533, నారాయణ్ పేట్ 525, నిర్మల్ 528, నిజామాబాద్ 1043, పెద్దపల్లి 1128, సిరిసిల్ల 633, రంగారెడ్డి 2392, సంగారెడ్డి 981, సిద్దిపేట 685, సూర్యాపేట 1073, వికారాబాద్ 709, వనపర్తి 661, వరంగల్ రూరల్ 407, యాదాద్రి 659 నామినేషన్లు దాఖలయ్యాయి.

First published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>