Home /News /telangana /

Telangana : వరి సాగుపై అన్నదాతల అభ్యర్థన -kcr సర్కారు వద్దన్నా మరో దారి లేదంటోన్న Nizamabad రైతులు

Telangana : వరి సాగుపై అన్నదాతల అభ్యర్థన -kcr సర్కారు వద్దన్నా మరో దారి లేదంటోన్న Nizamabad రైతులు

నిజామాబాద్ జిల్లాలో జోరుగా వరి సాగు

నిజామాబాద్ జిల్లాలో జోరుగా వరి సాగు

వరి సాగుకు అనుకూలంగా భూముల్ని సిద్ధం చేసుకున్న రైతులు మాత్రం ఈ ఒక్క ఏడాదైనా ధన్యం కొనాలంటూ సర్కారువారిని అభ్యర్థిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోనైతే మెజార్టీ మెజార్టీ రైతులు వరి సాగు చేసేందుకే ఆస‌క్తి చూపుతున్నారు. ధాన్యం విక్రయాల్లో తేడాలు వస్తే తాడోపేడో తేల్చుకుంటామని కర్షకులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
  (P.Mahender,News18,Nizamabad)
  యాసంగిలో వ‌రి సాగు వద్దని, ఒకవేళ ఎవరైనా రైతులు వరి పండిస్తే వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొనబోదని, అసలు వచ్చే ఏడాది రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలే ఉండబోవని, వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సర్కార్ పలుమార్లు స్పష్టం చేసింది. కానీ ఇప్పటికే వరి సాగుకు అనుకూలంగా భూముల్ని సిద్ధం చేసుకున్న రైతులు మాత్రం ఈ ఒక్క ఏడాదైనా ధన్యం కొనాలంటూ సర్కారువారిని అభ్యర్థిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోనైతే మెజార్టీ మెజార్టీ రైతులు వరి సాగు చేసేందుకే ఆస‌క్తి చూపుతున్నారు. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటల్లో కూడా పుష్కలంగా నీరుంది. దీంతో వరి సాగుకు ప‌రిస్థితులు ఆనుకూలంగా ఉంది. అయినాసరే ప్ర‌భుత్వం మాత్రం వ‌రి సాగు  చేయవద్దంటే ఎలా అని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు వరిసాగు చేసిన పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు ఏలా పండుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సూచించిన ఏ ఆరుతడి పంట కూడా వరిపొలాల్లో పండే అవకాశం లేదంటున్నారు.  నీళ్లు పుష్క‌లంగా ఉన్న‌ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులకు పొకుండా తమకు వరి వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా రైతులు.

  నిజామాబాద్ జిల్లాలో ప్ర‌తి యేట‌ యాసంగిలో 3లక్షల 75వేల ఎకరాలకు పైగా సాగవుతోంది. జిల్లాలోని  శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయి. గుత్ప అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు అందించడం వల్ల వరిసాగు పెరుగుతోంది. వీటితో పాటు బోర్ బావుల  కింద సాగు ఎక్కువగా చేయడం వల్ల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో ప్రతీ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదున్నర లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా కొనుగోలు చేస్తున్నారు.  ఇప్పటి వరకు 5లక్షల 87వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇవేకాకుండా వ్యాపారులు కూడా రెండున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశారు.  అయితే ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే వ్యాపారులు, మిల్లర్‌లు అంత మొత్తంలో కొనే పరిస్థితి కనిపించడం లేదు. యాసంగిలో వరి పంట సాగు చేయొద్దని అందుకు కొనుగోలు కేంద్రాలు ఉండవంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటించినా అన్నదా తలు మాత్రం వరి పంటవైపే మొగ్గు చూపుతున్నారు. ధాన్యం విక్రయాల్లో తేడాలు వస్తే తాడోపేడో తేల్చుకుంటామని కర్షకులు చెబుతున్నారు.

  shocking : Omicron భయంతో భార్య గొంతు నులిమి, ఇద్దరు పిల్లల పుర్రెలు పగలగొట్టిన ఫొరెన్సిక్ ప్రొఫెసర్  ప్రధానంగా వర్ని  మండలంలో వరి నాట్లను ముమ్మరంగా వేస్తున్నారు. వానాకాలంలో గులాబ్‌ తుఫా న్‌ కారణంగా ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 20 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. దిగుబడి కోల్పోవడంతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. దీంతో  దిక్కుతోచని స్థితిలో కౌలు రైతులు ఈ యాసంగిలో వరి సాగు చేయక తప్పడం లేదు. ప్రభుత్వ ప్రకటన దడ పుట్టిస్తున్నా ప్రత్యామ్నాయ పంటలు సాధ్యం కాదని అందుకు వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి విత్తనాలు అందు బాటులో లేవని రైతన్నలు వాపోతున్నారు. వరికోత యంత్రాల  గాట్లు, నీరు పుష్కలంగా ఉండటం వల్ల పంట దుక్కులు రావడం లేదని ఆందోళన చెందుతు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో పునరాలోచించి వానకాలం పంట నష్టం కారణంగా యాసంగిలో వరి సాగుకు అవకాశం కల్పించాలని కర్ష కులు కోరుతున్నారు. రైతులకు భరోసాగా ఉండాల్సిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ గందరగోళం సృష్టించడం పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  konijeti rosaiah : వైఎస్సార్‌ను కత్తితో పొడిచి సీఎం అయ్యేవాడిని -రోశయ్య సంచలన వ్యాఖ్యలు -viral video  వరి అంటే వర్ని అనే పేరు ప్రఖ్యాతలు గల ప్రాంతం మాదని రైతులు అంటున్నారు. మా ప్రాంతమంతా వరి పంట సాగుకే అనుకూలంగా ఉంది. ప్రస్తుతం వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయాల్సి వస్తోంది. ఒకవేళ వేరుశనగ, పొద్దు తిరుగుడు పంట వేయాలన్నా అందుకు భూములు ఇప్పటికే నీరు పట్టి దుక్కిరాని దుస్థితి నెలకొంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు, చెరువుల్లో నీరు  పుష్కలం ఉన్న  కారణంగా ఇతర పంటల సాగు సాధ్యం కావడం లేదు. వరి సాగు వద్దనడంతో కౌలు రైతులు సాగుకు ముందుకు రాక చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఒక్కసారైనా వరి సాగుకు అవకాశం కల్పించాలన్నారు. జిల్లాలో ఈ యాసంగిలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలని వరి తగ్గించి ఇతర పంటలను సాగుచేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని, వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాల ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూ చించారు. కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, రైస్‌మిల్లర్‌లు, రైతుబంధు ప్రతినిధులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. యాసంగిలో పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు.
  Published by:Madhu Kota
  First published:

  Tags: CM KCR, Farmers, Nizamabad District, Paddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు