Nizamabad: ఈ కాలేజీ అమ్మాయిల కష్టాలు ఎవరికీ రావొద్దు..

కాలేజీలో కోతుల భయంతో యువతులు

విద్యార్థులు కాలేజీ త‌ర‌గతి గ‌దిలోకి వెళ్లిన త‌రువాత కోతులు వాటి ఆట‌లు ప్రారంబిస్తున్నాయి. ఇక్క‌డి నుంచి అక్క‌డికి, అక్క‌డి నుంచి ఇక్క‌డికి తిరుగుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ ల‌ను ఎత్తుకెళుతున్నాయి..

  • Share this:
    అమ్మాయిల‌ కాలేజీకి వ‌చ్చిన వాన‌రాలు... వ‌చ్చి బుద్దిగా ఉండకుండా పౌచులు, చున్నిలు, టిఫిన్ బాక్స్ లు ఎత్తుకెలుతున్నాయి.. దీంతో విద్యార్థినిలు త‌ర‌గ‌తి గ‌దిలో కూర్చునేందుకు బ‌య‌ప‌డుతున్నారు.. చ‌దువు మీద క‌న్నా కోతులు ఎప్పుడు వ‌స్తాయి. ఎక్క‌డి నుండి వ‌స్తాయి.. ఏం చేస్తాయి అనే ఆలోచ‌న‌తోనే రోజు గ‌డుస్తుంది.. వాన‌రాల నుంచి ర‌క్ష‌ణ‌ క‌ల్పించాల‌ని కాలేజీ ప్రిన్సిప‌ల్ పిర్యాదు చేసిన అట‌విశాఖ అధికారులు స్పందిచలేదు.. దీంతో క‌లెక్ట‌ర్ కు పిర్యాదు చెసిన కాలేజీ యాజమాన్యం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట‌గ‌ల్లి ప్రాంతంలో ఉన్న ప్ర‌భుత్వ‌ గ‌ల్స్ జూనియ‌ర్ కాలేజీలో కొతుల బెద‌డ ఎక్కువైంది.. కాలేజీ ఆవర‌ణ‌లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.. అయితే గ‌త కొంత కాలంగా కాలేజీ మూసి ఉండ‌డంతో క‌పిరాజులు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. ఫిబ్ర‌వ‌రి ఒక‌టి నుంచి కాలేజీలు పునః ప్రారంభ‌మ‌య్యాయి. ఆనాటి నుంచి విద్యార్థినులు కాలేజీకి వ‌స్తున్నారు.

    విద్యార్థులు కాలేజీ త‌ర‌గతి గ‌దిలోకి వెళ్లిన త‌రువాత కోతులు వాటి ఆట‌లు ప్రారంబిస్తున్నాయి. ఇక్క‌డి నుంచి అక్క‌డికి, అక్క‌డి నుంచి ఇక్క‌డికి తిరుగుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ ల‌ను ఎత్తుకెళుతున్నాయి.. విద్యార్థుల పౌచులు, చున్నిల‌ను కూడా ఎత్తుకెళుతున్నాయి.. దీంతో విద్యార్థులు టీచ‌ర్లు బ‌య‌ప‌డుతున్నారు. చ‌దువు సంగ‌తి దేవుడెరుగు ముందు కోతి ఎక్క‌డి నుండి వ‌స్తుంది చూడు అన్న‌ట్టుగా ఉంది వారి ప‌రిస్థితి. దీంతో కాలేజీ ప్రిన్సిఫ‌ల్, లెక్చ‌ర‌ర్లు ఆట‌వి శాఖ అధికారుల‌కు ఫిర్యాదు చేసారు. అయినా వారు ప‌ట్టించుకోలేదు.

    కాలేజీలో కోతుల బెడద


    దీంతో జిల్లా క‌లెక్ట‌ర్ సీ.నారాయాణ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామ‌ని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. అటు విద్యార్థులు చ‌దువుపై దృష్టి పెట్ట‌లేక పోతున్నారు. కోతుల నుంచి త‌మ‌కు రక్ష‌ణ క‌ల్పించాల‌ని వారు కోరుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: