ఈ గ్రామం...అభివృద్ధికి ఆమడ దూరం...

నీసం బస్సులు కూడా రావ‌డం లేదని గ్రామస్తులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు..

గ్రామంలో స‌రైన రోడ్లు లేవు.. పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్య‌వ‌స్థ లేదు..

 • Share this:
  నిజామాబాద్ జిల్లాః  రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా 30రోజుల‌ ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం తీసుకు వ‌చ్చింది.. దీంతో అన్ని గ్రామాలు అభివృద్దికి బాట‌లు వేసుకున్నాయి.. కానీ మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ గ్రామం మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది... ఆ గ్రామంలో గుంత‌ల రోడ్లు, ఆస్త‌వ్య‌స్త‌మైన‌ డ్రైనేజీలు... కనీసం బస్సులు కూడా రావ‌డం లేదని గ్రామస్తులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు..
  నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవింద్ పల్లి గ్రామం.. గ్రామంలో సుమారు 1500 మంది జనాభా ఉంది.. గ్రామంలో స‌రైన రోడ్లు లేవు.. పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్య‌వ‌స్థ లేదు.. వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి.. సిజన‌ల్ వ్యాదులు వ‌చ్చే ఆవ‌కాశం ఉంది.. కానీసం ప‌రిశారాల‌ను ప‌రిశుభ్రం చేయాలేదు.. రోడ్లు, డ్రైనేజిలు చెత్త చేద‌రంతో నిండిపోయాయి.. ఆటు కరోనా ఇటు సిజ‌నాల్ వ్యాదులు వ‌చ్చే ఆవ‌కాశం ఉంది... ప్ర‌తి గ్రామం ప‌రిశుభ్రంగా ఉండే విదంగా గ్రామాస్థాయి అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఇప్ప‌టికే సూచించారు.. అయితే ఈ గ్రామంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని స్థానికులు చెబుతున్నారు.. కాలేజీలు నడిచే స‌మ‌యంలో బస్సు వచ్చేది.. ఇప్పుడు మా గ్రామానికి బ‌స్సు రావ‌డంలేద‌ని గ్రామస్తులు వాపోయారు.. ఆస్పత్రికి మండల కేంద్రానికి వెళ్లడానికి వృద్ధులకు పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు మరో పక్క కరోనా ఇలాంటి పరిస్థితుల్లో డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉండటంతో గ్రామస్తులు రోగాల బారిన పడ అవకాశముందని గ్రామస్తులు చెబుతున్నారు.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని వారు కోరుతున్నారు..
  పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు, ప్ర‌తినిధి..
  Published by:Venu Gopal
  First published: