• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • THIS TELANGANA VILLAGE NOT RECORDED A SINGLE CORONA CASE VB

Free covid village: ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు లేదు.. ఆదర్శంగా నిలిచిన ఆ గ్రామం.. ఎక్కడంటే..

Free covid village: ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు లేదు.. ఆదర్శంగా నిలిచిన ఆ గ్రామం.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Free covid village: కరోనా మహమ్మారి పల్లెలను కూడా తాకి అతలాకుతలం చేస్తోంది. పల్లె ప్రజలు కరోనా కారణంగా భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. అయితే తెలంగాణలోని ఓ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కారణం ఏంటి.. వాళ్లు కరోనా సోకకుండా ప్రత్యేకంగా ఏమైనా పాటిస్తున్నారా.. తెలుసుకుందాం.

  • Share this:
    కరోనా తెలంగాణలో దాదాపు ప్రతీ పల్లె మెట్టును తాకింది. పట్ణణాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయనుకుంటే పల్లెల్లో కూడా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లక్షణాలు కినిపించిన వారు ఆయా పీహెచసీలకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. కానీ తెలంగాణలోని ఓ పల్లెటూరులో మాత్రం ఇంతవరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ఆ ఊళ్లోని కుటుంబాలు 382 ఉన్నాయి. గ్రామంలో నివసించే ప్రజలు కేవలం 1100 మంది. అయితే వారి ఇళ్లులు కూడా దూరం దూరంగా ఉంటాయి. మనిషి, మనిషికి మధ్య చాలా దూరం ఉంటుంది. అయినా అక్కడ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తారు. మాస్క్ లు , శానిటైజర్లు వాడుతున్నారు. మొదటి వేవ్ లో ఆ గ్రామంలో మూడు కేసులు నమోదవ్వగా అప్పటి నుంచి ఇప్పటి వరకు విధిగా మాస్క్ లు ధరిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ తమ గ్రామాన్ని కాపాడుకుంటూ సెకంట్ వేవ్ లో కరోనా ఫ్రీ విలేజ్ గా పేరుపొందంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడో చెప్పలేదు కదా.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజిపేట్ గ్రామం.

    జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా కొత్తవారు ఊళ్లోకి వస్తే తగిన జాగ్రత్తలు తీసకుంటున్నారు. వారి ఆపి మాస్క్ , శానిటైజర్ ఇచ్చి ఎక్కువ సేపు వారి ఊరిలో ఉంచకుండా తొందరగా బయటకు పంపిస్తున్నారు. చిన్న కుగ్రామమైనప్పటికీ కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ గ్రామస్తులు తీసుకుంటున్న జాగ్రత్తలే అందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా బయటకు వెళ్లి వచ్చిన ప్రతీ ఒక్కరు పసుపు నీళ్లతో స్నానం చేసి ఇంట్లోకి వెళ్తారు.

    ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మూడు పూటలా వేడి నీళ్లను సేవిస్తున్నారు. ఆ గ్రామ సర్పంచ్ సహకారంతో ఊరి జనాలు నిబంధనలు పాటిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో హైపోక్లోరైడ్ చల్లించడం, డ్రైనేజీ పనులను, శానిటేషన్ వర్క్ ను దగ్గరుండి చూసుకోవడం చేస్తున్నారు సర్పంచ్. దీంతో పక్క గ్రామాల ప్రజల దృష్టి ప్రస్తుతం రాగోజిపేట్ గ్రామంపై పడింది. ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వేరే గ్రామస్తులు కూడా పాటిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు