హోమ్ /వార్తలు /తెలంగాణ /

Special Ganesh: చెక్కతో గణేష్, ఉత్సవాలుంటాయ్, నిమజ్జనం ఉండదు.. ఎక్కడంటే

Special Ganesh: చెక్కతో గణేష్, ఉత్సవాలుంటాయ్, నిమజ్జనం ఉండదు.. ఎక్కడంటే

కర్రతో తయారు చేసిన కరిముఖుడు

కర్రతో తయారు చేసిన కరిముఖుడు

Variety Ganesh Photos | 1948వ సంవత్సరంలో కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచిన నిర్మల్ పట్టణంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.

వినాయక నవరాత్రుల సందర్భంగా నెలకొల్పే విగ్రహాలను మట్టితో, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తారు. తొమ్మిది లేదా 11 రోజులపాటు ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి అనంతరం నిమజ్జనం చేస్తారు. కానీ ఆ ఊళ్ళో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయరు. పైగా అది కర్రతో తయారు చేసిన విగ్రహం. గత 72 సంవత్సరాల నుంచి పూజలందుకుంటున్నాడు ఆ గణనాథుడు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కర్ర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. తర్వాత 11వ రోజు ఆ విగ్రహాన్ని ప్రత్యేక రథంలో ఊరేగించి గ్రామ సమీపంలోని వాగు వరకు తీసుకెళ్లి ఆ విగ్రహంపై నీళ్లు చల్లి నిమజ్జన ప్రక్రియ ముగిస్తారు. తర్వాత మళ్లీ ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయంలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రుల సందర్భంగానే ఈ విగ్రహాన్ని బయటకు తీస్తారు. మిగతా రోజుల్లో అంటే సంవత్సరమంతా సత్య గణేశుడి చిత్రపటానికి పూజలు చేస్తారు. మళ్ళీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లోనే ఈ కర్ర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. 1948వ సంవత్సరంలో కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచిన నిర్మల్ పట్టణంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. గత 72 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.

వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్న గ్రామస్తులు

కోరి వచ్చిన భక్తుల కోర్కెకలు తీర్చే దైవంగా పేరుండటంతో ఇక్కడికి తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో నవరాత్రి ఉత్సవాలను రద్దు చేశారు. నవరాత్రుల్లో కేవలం గ్రామస్థులు మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామస్థులు, ఉత్సవ కమిటి సభ్యులు మాత్రమే పూజలు చేసి మిగతా సమయంలో ఆలయాన్ని మూసి వేస్తున్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితికి భక్తులతో కిక్కిరిసిపోయే పాలజ్ గ్రామం కరోనా కారణంగా నిర్మానుష్యంగా మారింది.

First published:

Tags: Ganesh Chaturthi 2020, Maharashtra, Telangana

ఉత్తమ కథలు