హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: మోటార్లకు మీటర్లపై మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి స్పందన ఇదే..

Munugodu: మోటార్లకు మీటర్లపై మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి స్పందన ఇదే..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు వుంటే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తాను బతికున్నంత వరకు మోటార్లకు మీటర్లు బిగించబోనని తెగేసి చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత, మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (BJP candidate of Munu Godu Komati Reddy Rajagopal Reddy) మండిపడ్డారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు (Meters for motors) వుంటే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మోటార్లకు మీటర్ల విషయంలో టీఆర్ఎస్‌ది అనవసర రాద్ధాంతమన్నారు.  మీటర్లు వున్నా ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)చెప్పారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడా అధికారికంగా చెప్పలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  మోటార్లకు మీటర్లు పెట్టే అంశంపై సీఎం కేసీఆర్​ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గతంలో మునుగోడు సభలో రైతులకు (farmers) సీఎం కేసీఆర్​ ఇదే నొక్కి చెప్పారు. కేసీఆర్ (KCR)​ బతికున్నంత వరకు రైతుల పొలాల్లో మీటర్లు (No meters) పెట్టడని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఒక వేళ బీజేపీకి ఓటేస్తే వాళ్లు వచ్చి మీటర్లు పెడుతారని ఆరోపించారు. కాంగ్రెస్​కు ఓటేస్తే వ్యర్థమేనని కేసీఆర్​ అన్నారు. మోదీకి చెందిన బడాబాబులు సూట్ కేసులతో రెడీగా ఉన్నారని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం.

  నేను చెప్పే మాట నిజమా ,కాదా ఆలోచించుకోవాలన్నారు. రైతుబంధు, రైతు బీమా ఎంతమందికి వస్తుందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. గతంలో రైతులు చనిపోతే కుటుంబం రోడ్డున పడేదని.. ఇప్పుడు రైతు చనిపోతే 10 రోజులలోపు 5 లక్షలు ఇస్తున్నామన్నారు. ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు సీఎం కేసీఆర్. మునుగోడు లో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకుకి సంబంధించినది అన్నారు.

  విద్యుత్ సంస్కరణలపై..

  మోసపోతే గోసపడుతామని మునుగోడు ప్రజలకు సీఎం హెచ్చరించారు. ఉన్న కరెంట్​, ఫించన్లు, రైతు బంధు ఊడగొట్టుకుందామా అని కేసీఆర్​ ప్రశ్నించారు. ఆఖరికి శ్మశానం మీద కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారని కేంద్రంపై సీఎం మండిపడ్డారు. ఆ డబ్బులన్నీ బ్యాంకులను మోసం చేసే వాళ్లకు పంచి పెడుతున్నారని ఆరోపించారు. మళ్లీ గ్యాస్​ సిలిండర్​ తక్కువ ధరకు రావాలంటే టీఆర్​ఎస్​కు (TRS) ఓటు పడాలని కేసీఆర్​ సూచించారు. ఈ ఎన్నిక ఓ వ్యక్తి కోసమో ఓ పార్టీ కోసమో జరిగేది కాదని సీఎం అన్నారు.  మరో సభలో కేసీఆర్​ ‘‘విద్యుత్ సంస్కరణలపై కేంద్రం ముసాయిదాను ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. శ్రీకాకుళం జిల్లాలో 25వేల వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా బిగించారు. మిగతా విద్యుత్ మీటర్ల కోసం రూ.737 కోట్లతో టెండర్లు కూడా పిలిచారు. కేంద్రం వారి సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయే అవకాశముంది. అయినాసరే, మోటార్లకు మీటర్లు పెట్టబోమని మేం స్పష్టంగా చెప్పాం’’. అన్నారు .

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Komatireddy rajagopal reddy, Munugodu By Election

  ఉత్తమ కథలు