ఈ పండుగ సీజన్‌లో ప్రతి ఒక్కరి జీవితాలు చాలా బిజీ(Busy)గా, హడావుడిగా మారిపోతుంటాయి. త్వరగా ఇంటికి వెళ్లాలనే తాపత్రయంతోనో లేదా మద్యం పుచ్చుకునో కొందరు ప్రజలు రోడ్లపై రాష్ డ్రైవింగ్(Rash Driving) చేస్తుంటారు. ఇలా వ్యవహరించేవారి పట్ల, ఇష్టానుసారం ట్రాఫిక్(Traffic) నియమాలను ఉల్లంఘించే వారి పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమైంది. ప్రస్తుత ఫెస్టివల్ సీజన్‌లో ట్రాఫిక్ ఆంక్షలను మరింత స్ట్రిక్ట్ గా చేసింది. భారతదేశంలో కొత్తగా మోటార్ వాహనాల చట్టం (Motor Vehicles Amendment Act 2019) అమల్లోకి తెచ్చాక ట్రాఫిక్ ఫైన్స్ విపరీతంగా పెరిగాయి.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రజలు భారీగా జరిమానాలు కట్టాల్సి వస్తోంది. ఇక తాగి ప్రమాదకరంగా వాహనం నడిపే వాహనదారులు అడ్డంగా బుక్కై భారీ మొత్తాల్లో జరిమానాలు చెల్లిస్తున్నారు. నివేదికల ప్రకారం ప్రభుత్వం చలాన్‌ల అమౌంట్స్, ట్రాఫిక్ శిక్షల విషయంలో అనేక కఠిన మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పుల ప్రకారం మీరు చేసే ఒక్క పొరపాటు అయినా సరే, మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు కూడా దారితీసే అవకాశం ఉంది. అందువల్ల ఈ పండుగ సీజన్‌లో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలు ఏంటో తెలుసుకుందాం.
1. ఈసారి ట్రాఫిక్ అధికారులు గడువు ముగిసిన లైసెన్స్‌లతో డ్రైవింగ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు.
2. వాహనానికి సంబంధించి పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండటం తప్పనిసరి. మోటార్ వాహనాల చట్టంలో సవరణలు తీసుకు కావడంతోపాటు.. ప్రజలలో పెరుగుతున్న అవగాహనతో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిపోయింది.
3. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ రూల్ ప్రకారం బస్సులో లేదా టాక్సీలో ఎక్కువమంది ప్రయాణిస్తే.. ఆ వాహనాల ఉద్యోగులను కఠినంగా శిక్షిస్తారు. బస్సు డ్రైవర్, కండక్టర్ లేదా టాక్సీ డ్రైవర్.. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినా.. డ్రైవింగ్ చేసేటప్పుడు ధూమపానం లేదా మద్యపానం చేసినా వారికి కఠిన శిక్ష విధిస్తారు.
4. పోలీసులు లేదా ట్రాఫిక్ అధికారులతో అనుచితంగా ప్రవర్తించడం.. వాహనాన్ని ఆపకపోవడం, ట్రక్కు క్యాబిన్‌లో కూర్చోవడం కూడా నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలు చేసినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.
5. కొత్త వాహన చట్టం కూడా డాక్యుమెంట్స్ తీసుకెళ్లే పని భారాన్ని తగ్గించింది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ (RTO) ఇన్స్పెక్టర్లు వాహనదారులకు విధించిన జరిమానా మొత్తం, డ్రైవర్లపై తీసుకున్న చర్యలను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి.
అంతేకాకుండా ద్విచక్రవాహనాలు నడిపే ప్రతీ ఒక్కరికీ లైసెన్స్ తో పాటు పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సురెన్స్ తప్పకుండా ఉండాలి. అవి లేకుండా బండి బయటకు తీస్తే మాత్రం.. ఇంటికి వచ్చే సరికి జేబుకు చిల్లు మాత్రం తప్పనిసరిగా పడుతుంది. అయితే వాహనాలకు ఇవే కాకుండా మరికిన్ని తప్పని సరిగా ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Traffic challan