THIS COUPLE FROM HYDERABAD LEFT SOFTWARE JOBS STARTED VEGETABLE FARMING AND EARNING GOOD MONEY BA BK
Hyderabad: కూరగాయలు పండిస్తూ రూ.కోట్లు గడిస్తోన్న హైదరాబాద్ జంట
సచిన్, శ్వేత
పూర్తి స్థాయి ఆటోమేటిక్ సాంకేతికతతో రూపోందిన ఈ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 150 మంది ఉపాధి పొందుతున్నారు. స్థానికంగా ఉన్న వారికే ఉపాధి కల్పించడంతోపాటు తమ మనసుకి నచ్చిన పని చేస్తూ వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు ఈ యువ జంట.
సాధారణంగా చదువు పూర్తవగానే యువతి, యువకుల కోరిక ఏముంటుంది? లక్షల్లో జీతం ఉండాలి, విదేశాల్లో ఉద్యోగం రావాలని కోరుకుంటారు. హైదరాబాద్ కు చెందిన ఈ యువ జంట మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. దాదాపు 18 ఏళ్లపాటు వివిధ దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసినప్పటికి పుట్టి పెరిగిన నేలపై వాళ్ల మమకారం పోలేదు.అందుకే ఈ యాత్రిక జీవితం కాదు ఆ నేలలోనే అసలైన జీవితముందని భావించి లక్షల రూపాయల జీతాలను, అత్యున్నత జీవన ప్రమాణాలను పక్కన పెట్టి స్వదేశానికొచ్చి... అత్యాధునికి పద్దతిలో వ్యవసాయానికి నాంది పలికారు. వాళ్లే సచిన్ దర్బార్వార్, శ్వేత. సచిన్ది రైతు కుటుంబం కానప్పటికి వ్యవసాయంపై చిన్నప్పటి నుంచి మక్కువ పెంచుకున్నారు. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ఈయన తన చదువు పూర్తవగానే న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. దాదాపు 18 ఏళ్లు పాటు వివిధ ప్రముఖ కంపెనీల్లో సాప్ట్ వేర్ గా ఉద్యోగిగా పనిచేశారు.
ఎప్పటికైనా సొంత నేలకు వచ్చి ఎదైనా చేయాలనే తపన అతనికి ఉండేది. అదే సింప్లీ ప్రెష్ పేరుతో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి వివిధ కూరగాయాలను ప్రకృతిసిద్దంగా పండిస్తూ వాటిని నగరంలో దాదాపు పలు సూపర్ మార్కెట్లు, హోటల్స్ కు సరాఫరా చేస్తోన్నారు సచిన్ దర్బార్వార్.
అత్యాధునిక పద్ధతుల్లో కూరగాయల సాగు
తన భార్య కూడా సహాయ సహకారాలు అందించడంతో 2013 లో న్యూజిలాండ్ నుంచి ఇండియాకు వచ్చి షామీర్ పేట్ లో దాదాపు 10 ఎకరాల స్థలంలో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. విదేశాల్లో వాడుకలో ఉన్న అత్యాధునిక పద్దతుల్లో ఇక్కడ కూరగాయల సాగు చేస్తోన్నారు. ఎక్కడా ఎటువంటి రసాయనాలు వాడకుండా పూర్తి స్థాయిలో పకృతి సిద్ధంగా కూరగాయలను పండిస్తోన్నారు.
సింప్లీ ఫ్రెష్ పేరుతో కూరగాయల విక్రయం
వీరు కూరగాయలు పండిస్తోన్న ఫామ్ కి ఎవరైనా వెళ్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఎంతో అత్యాధునిక విధానాలతో ఇక్కడ కూరగాయాలను పండించే విధానం ముక్కుమీద వేలేసుకునేలా చేస్తోంది. దాదాపు 10 ఎకరాల్లో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో 150 రకాల కూరగాయాలు పండిస్తోన్నారు.
కూరగాయల సాగు
“మాది వ్యవసాయ ఆధారిత కుంటుంబం కాకపోయినప్పటికి మాకు ఎక్కువ స్థలాలు ఉండేవి. మా తాతయ్య వ్యవసాయం చేసేవారు. కానీ మా నాన్న దాన్ని కంటిన్యూ చేయలేదు. అయినప్పటికి చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం పై చాలా మక్కువ ఉండేది. 2013 లో న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వచ్చేయాలి అనుకున్నప్పుడు మొదటి అక్కడకు వెళ్లాక ఏం చేయాలనే ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్న నుంచి వచ్చిన ఆలోచనే ఈ సింప్లీ ఫ్రెష్. ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా నాణ్యమైన కూరగాయాలను అందించాలనేదే మా సింఫ్లీ ఫ్రెష్ ధ్యేయం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు, యంత్రాలను ఉపయోగించి ప్రకృతిసిద్ధంగా కూరగాయాలు పండించొచ్చు అనేది నేను వ్యక్తిగత పనులకోసం వివిధ దేశాలు తిరిగినప్పుడు తెలుసుకున్నాను. అదే ఎందుకు మన దేశంలో చేయకూడదు అనే ఆలోచన నుంచి వచ్చింది ఈ వ్యవసాయ క్షేత్రం.’ అని న్యూస్ 18 కి తెలిపారు సచిన్.
కూరగాయల సాగు కోసం ఏర్పాటు చేసిన నీటి వనరులు
ప్రస్తుతం రోజుకి దాదాపు 8 వేల కిలోల వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు.. దాదాపు రూ.2 కోట్లు పెట్టుబడితో సిద్దిపేటకు సమీపంలో కూడా ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
సింప్లీ ఫ్రెష్ లో పండిన క్యారెట్లు
“2017-18 ఆర్ధిక సంవత్సరంలో ఈ వ్యవసాయ క్షేత్రం ద్వార ఆశించిన ఫలితాలు వచ్చాయి. దీంతో దాదాపు రూ.2 కోట్లు నగదు సమీకరించుకొని సిద్దిపేట సమీపంలో 150 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని వ్యాప్తి చేశాం. అక్కడ కూడా దాదాపు 150 రకాల కూరగాయల రకాలు అందుబాటులో ఉంటాయి. మొత్తం రెండు క్షేత్రాల నుంచి దాదాపు 29 వేల కేజీల కూరగాయలు రోజుకి పండిస్తోన్నాం’ అని న్యూస్ 18 కి తెలిపారు సచిన్ భార్య శ్వేత.
సింప్లీ ఫ్రెష్ లో పనిచేస్తున్న స్థానికులు
పూర్తి స్థాయి ఆటోమేటిక్ సాంకేతికతతో రూపోందిన ఈ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 150 మంది ఉపాధి పొందుతున్నారు. స్థానికంగా ఉన్న వారికే ఉపాధి కల్పించడంతోపాటు తమ మనసుకి నచ్చిన పని చేస్తూ వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు ఈ యువ జంట.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.