హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mangoes: మామిడి పండ్ల ప్రియులకు బ్యాడ్​న్యూస్​.. ఈసారి పండ్ల ధరలు పెరిగే ఛాన్స్​.. కారణం ఇదే అవ్వొచ్చు..!

Mangoes: మామిడి పండ్ల ప్రియులకు బ్యాడ్​న్యూస్​.. ఈసారి పండ్ల ధరలు పెరిగే ఛాన్స్​.. కారణం ఇదే అవ్వొచ్చు..!

ఈ ఏడాది పంట దిగుబడి అమాంతం తగ్గిపోయింది.. పంట ఎక్కువగా లేకపోవడంతో మామిడి పండ్ల ధరలూ పెరిగే ఛాన్సు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకీ పంట దిగుబడి తగ్గడానికి ఓ కారణం ఉంది.

ఈ ఏడాది పంట దిగుబడి అమాంతం తగ్గిపోయింది.. పంట ఎక్కువగా లేకపోవడంతో మామిడి పండ్ల ధరలూ పెరిగే ఛాన్సు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకీ పంట దిగుబడి తగ్గడానికి ఓ కారణం ఉంది.

ఈ ఏడాది పంట దిగుబడి అమాంతం తగ్గిపోయింది.. పంట ఎక్కువగా లేకపోవడంతో మామిడి పండ్ల ధరలూ పెరిగే ఛాన్సు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకీ పంట దిగుబడి తగ్గడానికి ఓ కారణం ఉంది.

  (న్యూస్. 18, మహబూబ్​నగర్​, సయ్యద్ రఫీ)

  రెండేళ్ల గా కరోనా మహమ్మారి రైతులకు (Farmers) నష్టాలే మిగిలించింది. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోక ముందే ఈ ఏడాది మామిడిపై దాడి చేసిన తామర పురుగు (Worms infesting mangoes) రైతుని నిండా ముంచింది. ఈ సమయానికి చెట్టు నిండా కాయలతో నిగనిగలాడాల్సిన తోటలు పూత కాతా లేకుండా రైతుల్ని వెక్కిరిస్తున్నాయి. రూ.లక్షలు వెచ్చించి పురుగుమందులు జల్లినా ఫలితం లేకుండా పోయింది. సాధారణ దిగుబడితో పోల్చుకుంటే సగం పంట కూడా చేతికందని  దుస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదని చెబుతున్నారు మామిడి రైతులు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

  ఉమ్మడి మహబూబ్​నగర్​లోని నాగర్ కర్నూల్ (NagarKurnool) జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం లోని సాగుచేసే  బెని సన్ రకం మామిడి (mango)కి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. రెండేళ్లుగా మామిడి దిగుబడి బాగా వచ్చినా కోవిడ్ ఆంక్షల కారణంగా డిమాండ్ పడిపోయింది. క్వింటాల్​ ధర రూ.20 వేల నుంచి రూ.  30వేల వరకు మాత్రమే పలకడంతో వాళ్ల కష్టాలను చవిచూశారు. ఈ ఏడాదైనా కలిసి వస్తుందని అనుకుంటే మామిడి (mangoes)ని ఆశించిన తామర పురుగు కన్నీళ్ళని మిగిల్చింది. సాధారణంగా మామిడిలో డిసెంబర్ జనవరి మాసాలు పూత పూస్తుంది . మార్చి నాటికి కాయలు కాసి ఏప్రిల్ మే మాసాల్లో కూతలు సాగుతాయి. కానీ కానీ ఈ సారి పూత ఆలస్యమైంది. తర్వాత పూత వచ్చినా అది నిలవలేదు. తామర పురుగు ఆశించడం (Worms infesting mangoes) తో 90 శాతం వరకు పూత రాలి పోయింది. పూత వింతగా మారిన వాటి పరిస్థితి అదే. దీంతో అసలే ఖాతా లేకుండా పోయింది..

  ముందే గుర్తించిన..

  జనవరి లోని తోటల్లో రైతులు తామర పురుగును గుర్తించారు. వాటి నివారణ కోసం ఎకరాకు రూ 10, వేల అ వరకు ఖర్చు చేసి పలు దఫాలుగా పురుగుమందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. చూడ్డానికి చెట్లన్ని పచ్చగా నిగనిగలాడుతున్నా దిగుబడి 80 శాతానికి పడిపోయిందని చెప్పారు. బహిరంగంగా మార్కెట్లో మామిడి ధర (Mangoes Price)  టన్ను రూ రూ.లక్ష పలుకుతున్నా అమ్మడానికి పంట లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఈసారి పెట్టుబడులు సైతం ఎక్కువే..

  కొల్లాపూర్ డివిజన్లో 9,900 మంది రైతులు 22వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తుండగా అందులో 15 వేల ఎకరాల వరకు పంట నిచ్చే తోటలు ఉన్నాయి. అయితే 50 శాతానికి పైగా కౌలు రైతులే తోటలను లీజుకు తీసుకొని సాగు చేస్తుంటారు. రైతులకిచ్చే కౌలు సొమ్ము కాకుండా ఈసారి పెట్టుబడులు సైతం ఎక్కువే అయ్యాయి. ముఖ్యంగా పురుగు ఉత్పత్తిని నివారించేందుకు పురుగుమందుల కోసమే అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చింది.

  ఈసారి తోటలపై పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావని కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 63,481 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయి. వాటిలో పంట నిచ్చే తోటలు 38,220 ఎకరాలు సగటు దిగుబడి  ఎకరాకు నాలుగు టన్నులు వచ్చినా 1.52.896 మెట్రిక్ టన్నుల దిగుబడి రావాలి. కానీ ఈసారి ఆ  దిగుబడి సుమారు 70 వేల అ మెట్రిక్ టన్నులకు పడిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పంట ఎక్కువగా లేకపోవడంతో మామిడి పండ్ల ధరలూ పెరిగే ఛాన్సు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  First published:

  Tags: Agriculture, Farmer, Mahbubnagar, Mango, Nagarkurnool

  ఉత్తమ కథలు