Home /News /telangana /

THIRD PHASE OF PANCHAYAT ELECTIONS TO BE HELD TODAY IN TELANGANA STATE NK

కొనసాగుతున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికలు... మధ్యాహ్నం కౌంటింగ్

ప్రకాశం 24,95,383

ప్రకాశం 24,95,383

Telangana Panchayat Elections : సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగితే... ప్రజలు అధికార పార్టీ బలపరిచే అభ్యర్థులకే అనుకూలంగా ఓట్లు వేస్తారు. తెలంగాణలో అదే జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో ఎక్కువ సీట్లు సాధించిన టీఆర్ఎస్... ఇవాళ జరిగే మూడో దశపైనా ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

ఇంకా చదవండి ...
తెలంగాణలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. ఈ నెల 21న తొలి, 25న రెండో దశ ఎన్నికలు జరిగాయి.  తుది విడత ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుండగా...11,664 మంది బరిలో నిలిచారు. అలాగే 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 573 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. తుది విడత పంచాయతీ పోలింగ్‌ ఉదయం 7 గంటలకు మొదలుకాగా..మధ్యాహ్నం ఒంటిగంటకు ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాల్ని వెంటనే ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. పోలింగ్‌ విధుల నిర్వహణకు పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బందితో పాటు పోలీసుల సేవల్ని వాడుకుంటున్నారు.

telangana panchayat election, telangana panchayat raj, telangana panchayat election results, trs, congress, tdp, telangana news, తెలంగాణ పంచాయతీ ఎన్నికలు, తెలంగాణ పంచాయతీ తుది విడత ఎన్నికలు, తెలంగాణ పంచాయితీ ఎన్నికల ఫలితాలు, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ
ప్రతీకాత్మక చిత్రం


తొలి, రెండో విడతలో అభ్యర్థులు కోట్ల రూపాయలు పంచిపెట్టారు. భారీగా మద్యం, బిర్యానీ సరఫరా చేశారు. మూడో దశలో కూడా అదే జరిగేలా ఉంది. ఇప్పటికే డబ్బు పంపిణీ జరుగుతుండగా... పెద్ద ఎత్తున మద్యం, బిర్యానీ సప్లైకి ఆర్డర్లు వెళ్లిపోయాయి. అధికారులు పక్కా నిఘా పెట్టామని చెబుతున్నా... తెరవెనక తంతు జరుగుతూనే ఉంది. మంగళవారం వరకు రూ.1.95 కోట్ల నగదు, రూ.65 లక్షల విలువ చేసే మద్యం, ఇతర వస్తువుల్ని పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

telangana panchayat election, telangana panchayat raj, telangana panchayat election results, trs, congress, tdp, telangana news, తెలంగాణ పంచాయతీ ఎన్నికలు, తెలంగాణ పంచాయతీ తుది విడత ఎన్నికలు, తెలంగాణ పంచాయితీ ఎన్నికల ఫలితాలు, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ
ప్రతీకాత్మక చిత్రం


పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇవాళ పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఓటు వేసేందుకు ఈ సెలవును ఇచ్చారు. సెలవు ఇవ్వని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

 

Photos : నాకూ ఒకడు తగిలాడు... సీక్రెట్ బయటపెట్టిన సారా అలీ ఖాన్
First published:

Tags: Gram Panchayat Elections, Telangana News, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు