హోమ్ /వార్తలు /తెలంగాణ /

Robbery: కరోనా వేళ ఇల్లు గుల్ల.. వ్యాక్సిన్ వేసుకొని తిరిగి వచ్చే సరికి షాక్.. ఇంట్లో దాచిన బంగారం, వెండి..

Robbery: కరోనా వేళ ఇల్లు గుల్ల.. వ్యాక్సిన్ వేసుకొని తిరిగి వచ్చే సరికి షాక్.. ఇంట్లో దాచిన బంగారం, వెండి..

Robbery: ఓ వైపు కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుంటే మరోవైపు దొంగలు తమ పని కానిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసమని ఇంటికి తాళం వేసి వెళ్లిన వారి ఇళ్లలో దొంగలు రెచ్చిపోయారు. సుమారు 5.50 తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...

  (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  అర్హత ఉన్న ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని దండోరా వేయించారు. ఆ ఊర్లో కరోనా వ్యాక్సిన్ కోసం ఇంటికి తాళం వేసి వేరే ఊళ్లో ఉన్న పీహెచ్ సీ కేంద్రానికి వెళ్లారు. దానిని తమకు అనువుగా మార్చుకున్న దొంగలు ఇళ్లల్లో చోరీలకు దిగుతున్నారు. మాటు వేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ ఇంట్లో ఇలా వ్యాక్సిన్ వేసుకోని రాగానే ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో దాచిపెట్టిన బంగారం, వెండి మొత్తం దోచుకెళ్లారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆరోగ్యంగా ఉండాలని కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ కోసం ఊరెళితే దుండగులు ఇంట్లో నగదు నగలను దొంగలించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎస్ ఐ వెంకటేశ్వర్ల కథనం ప్రకారం..

  మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీతావాణి నివాసం ఉంటుంది . కోవిడ్ టీకా తీసుకున్నాక ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే చూసేవారు ఇక్కడ ఎవరు ఉండరని గత నెల 25న వ్యాక్సిన్ తీసుకోవడం కోసమని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో నివాసం ఉంటున్న తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. టీకా తీసుకున్న తర్వాత ఇంటికి బయలు దేరింది. అటుగా వెళ్తున్న వారు తలుపులు తెరిచి ఉండడంతో ఇరుగుపొరుగు గమనించి గీతవాణికి సమాచారం ఇచ్చారు.

  దీంతో గ్రామానికి తిరిగి వచ్చిన ఆమె ఇంట్లో పరిశీలించగా బీరువాలో దాచి 5 .50 తులాల బంగారు గాజులు, 30 తులాల వెండి సామగ్రి, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. త్వరలో దొంగలను పట్టుకొని నగదు, బంగారాన్ని రికవరీ చేస్తామన్నారు.

  First published:

  Tags: Corona cases, Corona Vaccine, Gold robbery, Mahabubnagar, Robbery, Silver robbery

  ఉత్తమ కథలు