సాధరణంగా దొంగతనాలు చేసే వారికి మంచి మానవత్వం,దేవుడిపై నమ్మకం, భక్తి అనేవి ఉండవు.. కొంతమంది కరుడు గట్టిన దొంగల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా దేవాలయాల్లో దొంగతనాలు జరగడం అనేది రేర్‌గా జరుగుతుంటాయి. అయితే వారికి దేవుడిపై భక్తి కనీసం లేని వాళ్లే ఇలాంటీ దొంగతనాలు పాల్పడతారని అంతా భావిస్తారు. కాని అది తప్పు అని నిరూపించి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. దేవుడి గుళ్లో దొంగతనాలు చేసే వారికి భక్తి, భయం కూడా ఉంటాయనేది ఈ సంఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఖమ్మంలోని ఓ ఆలయంలో దొంగతనానికి పాల్పడిన ఈ దొంగకి మాత్రం అమ్మవారు అంటే చాలా భయం. అయినా సరే ఆలయంలో దొంగతనం చేయాలనుకున్నాడు. జిల్లాలోని కొండయ్యగూడెంలోని అంకమ్మ ఆలయంలో అక్టోబర్ 29వ రాత్రి దొంగతనం జరిగింది. ఉదయం ఆలయం తెరిచేందుకు వచ్చిన పూజ లోనికి వెళ్లి చూడగ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేశారు.అనంతరం ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం చేస్తున్న వీడియో నమోదయింది.
అయితే ఆ వీడియోలో దొంగ ముందుగా అమ్మవారికి మొక్కుకున్నాడు.. అమ్మా క్షమించు అమ్మా అమ్మవారి కాళ్లు మొక్కి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటనతో దొంగలకు కూడా దైవభక్తి ఉందని ఈ ఘటన రుజువు చేసింది. అయితే ఆ దొంగ కోసం పోలీసులు వెతుకుతున్నారు.. అమ్మవారికి బయట పడకుండా మొక్కుకుంటే ఏకంగా తాను దొంగతనం చేసిన వీడియో బయటపడడం ఆ దొంగకు కష్టకాలాన్ని తెచ్చిపెట్టింది. ఎంత అమ్మవారి మీద భక్తి ఉన్నా.. తన గుళ్లోనే దొంగతనం చేస్తుంటే ఊరుకుంటుందా అనే కామెంట్స్ నెటిజన్స్ నుండి వస్తున్నాయి. దొంగతనం చేసిన వాడు ఎప్పటికైన దొరకకుండా ఉండలేడని మరికొంతమంది వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.