హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad : పగటిపూట ఎలక్ట్రిషియన్ .. రాత్రిపూట దొంగతనాలు.. పోలీసుల అరెస్ట్‌తో విస్తుపోయో విషయాలు

Adilabad : పగటిపూట ఎలక్ట్రిషియన్ .. రాత్రిపూట దొంగతనాలు.. పోలీసుల అరెస్ట్‌తో విస్తుపోయో విషయాలు

adilabad theft

adilabad theft

Adilabad : ఉదయం ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తూ.. రాత్రిపూట దొంగతనాలు చేస్తున్న వాడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇలా గత నాలుగు నెలలుగా ఏడు ఇళ్లలో దొంగతనాలు చేస్తూ.. ముప్పుతిప్పలు పెడుతున్న దొంగ అరెస్ట్ అయ్యాడు.

  గత నాలుగు నెలల నుండి ఆదిలాబాద్( Adilabad) జిల్లా కేంద్రంలోని తాళం వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యం చేసుకొని వరుసగా దొంగతనాలకు (theft) పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు (police) అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి సుమారు ఆరు లక్షల 53 వేల రూపాయల విలువైన 13 తులాల బంగారు ఆభరణాలు, (gold)ఆరు తులాల వెండి ఆభరణాలు, నాలుగు సెల్ ఫోన్లు,(cell phone ) ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  వరుస దొంగతనాలతో అలర్ట్ అయిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ టివి కెమెరాల(cc tv camera) సహాకారంతో నిందితుడిని పట్టుకోగలిగామని జిల్లా ఎస్.పి. ఎం. రాజేష్ చంద్ర ( sp rajeshchandra) తెలిపారు. కాగా నిందితుడు గత నాలుగు నెలల నుండి ఆదిలాబాద్ పట్టణంలో తాళం వేసి (locked house ) ఉన్న ఏడు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పి వెల్లడించారు. ఈ క్రమంలోనే వరుసగా చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసేందుకు స్థానిక డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.. కాగా ఈ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టిందని చెప్పారు...

  ఇది చదవండి : రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ


  ఇందులో భాగంగానే దొంగతనాలు జరిగిన ఏడు ఇళ్ళను సందర్శించి అవసరమైన సాక్ష్యాలను బృందం సేకరించారు. అనంతరం సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ కెమెరాల సహకారంతో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. గురువారం పట్టణంలోని రాంనగర్ శివారులో గ్రామీణ సిఐ కే. పురుషోత్తం చారి, పట్టణ సీఐ ఎస్. రామకృష్ణ ఆధ్వర్యంలో మావల ఎస్సై ఏ. హరిబాబు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తిని అదుపులో తీసుకొని తమదైన శైలిలో విచారించగా ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీకి చెందిన షోయబ్ ఖాన్ ఎలక్ట్రిషన్ గా పని చేస్తూ అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇళ్లలో తాళం పగలకొట్టి చోరీలకు పాల్పడినట్లు వెల్లడించాడు.

  ఇది చదవండి : మహిళల బాత్రూంలో సెల్ కెమెరా... ! నిందితుడిపై నిర్భయ కేసు.. విచారణలో సంచనాలు.. !


  గత నాలుగు నెలల్లో వరుసగా ఏడు దొంగతనాలు చేసి మొత్తం 13 తులాల బంగారు ఆభరణాలు, ఆరు తులాల వెండి ఆభరణాలు, నాలుగు సెల్ ఫోన్లను ( mobil phones )దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. నిందితున్ని న్యాయస్థానంలో హాజరు పరిచి రిమాండ్ కు ( remand)  తరలిస్తున్నట్లు తెలిపారు. దొంగతనం జరిగిన సొత్తును స్వాధీనం చేసుకున్నామని, త్వరలో కోర్టు ( court) ఆదేశాల మేరకు బాధితులకు అప్పగిస్తామని తెలిపారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Adilabad, Crime news, Telangana

  ఉత్తమ కథలు