Home /News /telangana /

THIEF ARGUED WITH HYDERABAD POLICE COMMISSIONER VRY

Hyderabad :వీడు మాములు దొంగ కాదు.. పోలీసు కమిషనర్‌తో వాగ్వావాదం..కారణం ఇదే...

Hyderabad :వీడు మాములు దొంగ కాదు..

Hyderabad :వీడు మాములు దొంగ కాదు..

Hyderabad : ఓ దొంగ ఏకంగా హైదరాబాద్ పోలీసుల కమిషనర్‌తో వాగ్వావాదానికి దిగాడు. తాను చేసిన దొంగతనంలో ఆయన భార్యకు సంబంధం లేదంటూ... వాదించాడు.

  ఎంత క్రిమినల్ అయినా.. ఎన్ని నేరాలు చేసిన .. తన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో చూడడం కోసమే.. ఏది చేసిన తన భవిష్యత్‌ కన్న తన భార్య పిల్లల భవిష్యత్ కోసమే తహతహలాడుతుంటారు.కాని చివరకు తమపై అధారపడిన వారు పోలీసులకు పట్టుపడినా.. లేదా వాళ్లను కూడా నేరాలకు బాధ్యులను చేసినా వారు తట్టుకోలేరు. అయితే ఇలాంటీ సంఘటన పోలీసులకు ఎదురైంది.. దొంగతనం చేసిన నిందుతుడి ఆయనకు సహకరించినందుకు భార్యను కూడా నిందితురాలిని చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ దొంగ పోలీసులపై ఇలా కామెంట్ చేశాడు.

  ఓ దొంగతనం కేసులో నిందితుడు ఏకంగా పోలీసు కమిషనర్‌తోనే వాగ్వావాదానికి దిగాడు.నన్ను ఏమైనా చేసుకొండి.. ఈ కేసులో నా భార్యను ఎందుకు తీసుకువస్తున్నారు. నేను చేసిన దొంగతనాలతో ఆమెకు ఏమిటి సంబంధం అంటూ గట్టిగా కమిషనర్‌పై అరిచాడు. మరోవైపు నా పాపకు మూర్ఛ వ్యాధి ఉంది..ఒకవేళ ఆమెను కేసులో ఇన్వాల్వ్ చేస్తే... నా బిడ్డను ఎవరు చూసుకోవాలి అంటూ ప్రశ్నించాడు. దీంతో ఆ దొంగను కమిషనర్‌ నుండి దూరంగా తీసుకుని వెళ్లారు.

  Khammam :విషాదం...! కొడుకు మృతిని తట్టుకోలేని తండ్రి... ఖననం చేసిన చోటే ఉరి...!


  ఆ దొంగకు సంబంధించి వివరాల్లోకి వెళితే... ఆ దొంగ వయసు 27 ఏళ్లు.. ఇప్పటికే ఒకటి కాదు, రెండు కాదు.. 59 దొంగతనాలు చేశాడు.. దీంతో రెండు సార్లు పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు.. కాగా ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన 8 రోజులకే 70తులాల బంగారం చోరీ చేశాడు. పోలీసులు ఆ ఘరానా దొంగ అతని భార్యతోపాటు మరో దొంగను అరెస్టు చేశారు. వారి నుంచి 41 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు.

  నిందితుడు కర్నూలు జిల్లా కండేలికి చెందిన చెందిన గుంజపాగు సుధాకర్‌ అలియాస్‌ సాయి అలియాస్‌ ఆంధోనీ, అలియాస్‌ కాకా, అలియాస్‌ డేంజర్‌ కొన్నేళ్ల క్రితం బతుకు దెరువుకోసం నగరానికి వచ్చాడు. మెహిదీపట్నంలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు.

  Women arrest : కరోనాతో ఆర్థికంగా చితికిపోయి.. తెలిసినవారితో కలిసి..


  దీంతో తనకు జైల్లో పరిచయం అయిన మరోకరు ఆయూబ్ అనే దొంగతో కలిసి ఈ ఏడాది అక్టోబర్‌-21న తెల్లవారుజామున గగన్‌మహల్‌ స్వామి నిలయం అపార్టుమెంట్‌లోకి చొరబడి, 70 తులాల బంగారం చోరీచేశారు. చోరీ సొత్తును సుధాకర్‌ తన భార్య నాగమణి ఇచ్చాడు. ఆమె కొంత సొత్తును ముంబైకి చెందిన మహ్మద్‌ తబ్రేజ్‌దౌడ్‌ షేక్‌ సహకారంతో అమ్మేసి సొమ్ముచేసుకుంది. దాంతో పోలీసులు ఇద్దరు దొంగలు సుధాకర్‌, ఆయూబ్‌తో పాటు.. సుధాకర్‌ భార్యని కూడా అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime, Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు