Etela Rajender: హుజురాబాద్ లో అప్పుడే వేడెక్కిన రాజకీయం.. ఈటలను ఢీకొనేది ఆయనేనా..!

ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)

Etela Rajender: ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకి రసవత్తర చర్చకొనసాగుతుంది . ఈటల రాజేందర్ వివిధ రాజకీయ పక్షాలు , కుల సంఘాలు , అనుచరులతో భవిష్యత్ కార్యా చరణపై సుదీర్ఘ సమాలోచనలు కొనసాగిస్తున్నారు .

 • Share this:
  (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  ఈటల టీఆర్ ఎస్ పార్టీకి , తన శాసనసభ్యత్వానికి రాజీ నామా చేస్తే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీకి ఎన్నిక అనివార్యమవు తుంది . ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు ముహూర్తం కూడా ఖరారు చేసుకుంటున్నారని ఈటల అనుచురులు చెప్పకనే చెబుతున్నారు . ఈ క్రమంలో సమీప భవిష్యత్ లో ఉప ఎన్నిక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైతే టీఆర్ఎస్ పక్షాన ఎవరిని అభ్యర్థిగా పోటీలో పెట్టాలన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలిసింది . ఆత్మగౌరవం కోణం దృక్పథం తో ఈటల ఎన్నికల బరిలోకి వెళుతున్న ఈ పరిస్థితుల్లో అతనిపై ధైటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలు స్తుంది . మాజీ ఎంపీ , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ , రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు , బీసీ కమీషనర్ మాజీ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు , బీజేపీ నేత , మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి , కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డిల అభ్యర్థిత్వాలపై ముఖ్యమంత్రి అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  ఈ అభ్యర్థుల బలాలు , బలహీనతరలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. బోయినపల్లి వినోద్ కుమార్ 2004 లో హన్మకొండ పార్ల మెంటు నుంచి ప్రాతి నిధ్యం వహించగా , 2011 లో కరీంనగర్ నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పరాజయం పొందారు. ఆయన సేవలను గుర్తించి క్యాబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు . అంతేగాక మంత్రివర్గ సమావేశంలో శాశ్వతంగా పాల్గొనడానికి ఆయనను నియమిస్తూ సీఎం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు . వినోద్ కుమార్‌ను మంత్రిని చేసే ఆలోచనతో ఇక్కడి నుంచి పోటీలో నిలపాలని ఆలో చిస్తున్నట్లు తెలసింది . గత పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కు ఈ సెగ్మెంట్ నుంచి భారీ ఆధిక్యత వచ్చింది . పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు గతంలో పునర్ విభజనకు ముందు పాత హుజూరాబాద్ నియోజవర్గం నుంచి 2001 , 2008 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు .

  వైఎస్ ప్రభుత్వంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు . తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకువచ్చారు. సీఎం కేసీఆర్ పై అత్యంత గౌరవం కలిగి ఉంటారు . ఆయనపై గౌరవంతోనే ఆయన కుమారుడు సతీష్ కుమార్ కు 2014 , 2018 లో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు . ఈటల ఎపిసోడ్ నేపథ్యంలో కెప్టెను లేదా వారి కుటుంబంలో ఒకరిని ఎన్నికల బరిలో దించితే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలసింది . మొదటి నుంచి పార్టీలో నాయకుడికి వీర విజేతగా కొనసాగుతున్న వకుళాభరణం కృష్ణ మోహన్ పేరును సీఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. విద్యావేత్త , బీసీ నాయకునిగా ఓయూలో ఎదిగాడు . బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేశాడు . మంచి వక్తగా టీవీ చర్చలలో ప్రభుత్వం పక్షాన వాదనా పరిమతో చక్కగా మాట్లాడే పార్టీ ప్రతినిధి. సీఎం పరిపాలన , సంక్షేమ పథకాలపై ప్రముఖ దినపత్రికల్లో వ్యాసాలు రాస్తుం టాడు. 2009 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నిల బరిలో నిలిచి ఈటల రాజేందర్ పై 15 వేల ఓట్లు స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు .

  2010 ఉప ఎన్నికల్లో కూడా పోటీ పడ్డ ఆయన ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరారు . ఈ నియోజవర్గంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఓసీ అభ్యర్థిని పోటీలో ఉంచితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది . వకుళాభరణం దాసరి అనే సామాజిక వర్గానికి చెందినవాడు. చిన్న సామాజిక వర్గం - వకుళాభరణం స్థానికుడిగా.. ఎదిగి ఆనాడు అప్పటి సీఎం వైఎస్ఆర్ దృష్టిని ఆకర్శించాడు . బిసి మంత్రిగా ఉన్న సమయంలో వకుళాభరణం ను బిసి కమీషన్ సభ్యునిగా నియమించడంలో కీలకపాత్ర పోషించారు . ఎన్నిక అనివార్యమైతే వకుళాభరణంకు కెప్టెన్ అశిష్యులు ఉంటాయని బీసీ నేతలంటున్నారు . ఏది ఏమైనా మంచి రాజకీయ విశ్లేషకుడైన వకులభరణం పేరు కూడా ప్రముఖంగా పరిశీలనలో ఉండటంతో హుజూరాబాద్ లో అప్పుడే చర్చ మొదలైంది . ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డితో కూడ కెసిఆర్ మాట్లాడారని అవకాశం వస్తే ఉప ఎన్నికలో పెద్ది రెడ్డి ని పోటీ కి దింపుతారని కూడా టాక్. గత ఎన్నికల్లో హుజురాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి తో కూడా చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది . పెద్దిరెడ్డి పాత హుజురాబాద్ నియోజవర్గం నంచి రెండు సార్లు గెలుపొంది తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు . నియోజక వర్గ పునర్విభజన తరువాత ఆయన హుస్నాబాద్ నుంచి పలు మార్లు పోటీ చేసినా ప్రజల ఆధరణకు నోచుకోలేదు . ఆయన కు ఈ ప్రాంతంలో పేరున్నది. క్రియాశీల రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు . ఏది ఏమైనప్పటికీ ఈటెల మంత్రి పదవి పోవడం తో ఒక్కసారిగా హుజురాబాద్ నియోజకవర్గం లో రాజకీయం వేడెక్కింది అని చెప్పవచ్చు.
  Published by:Veera Babu
  First published: