Home /News /telangana /

THESE RULES SHOULD BE FOLLOWED WHILE CAMPAIGNING IN GHMC ELECTIONS CONFIRMS STATE ELECTION COMMISSION AK

GHMC Elections: గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం.. ఈ రూల్స్ పాటించకపోతే కేసులే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

GHMC Elections: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గతంలో మాదిరిగా కాకుండా నిబంధనల మేరకు మాత్రమే ప్రచారం చేపట్టాలని మార్గదర్శకాలను విడుదల చేసింది.

    జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రేటర్‌లో రాజకీయ సందడి మొదలైంది. పోలింగ్‌కు 15 రోజులు కూడా సమయం లేకపోవడంతో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం సహా వివిధ అంశాలపై దృష్టి పెట్టాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. కరోనా నేపథ్యంలో ప్రచారం విషయంలోనూ అనేక ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గతంలో మాదిరిగా కాకుండా నిబంధనల మేరకు మాత్రమే ప్రచారం చేపట్టాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. రెండు వాహనాలతోనే కాన్వాయ్ ఉండాలని.. భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది.

    ఇంటింటి ప్రచారం నిర్వహించే విషయంలో భద్రతా సిబ్బంది మినహా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం కోసం ఎక్కువ ఆధారపడే రోడ్ షోలపై కూడా నిబంధనలు విధించింది ఎస్ఈసీ. పార్టీల అభ్యర్థుల రోడ్ షోలకు మధ్య కనీసం అరగంట విరామం ఉండాలని తెలిపింది. బహిరంగ సభలకు అనుమతి నిరాకరించింది. రోడ్ షోల్లోనూ కరోనా నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఎన్నికల ప్రచారం సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల పరిశీలకులు కేసులు పెట్టనున్నారు.

    అంతకుముందు జీహెచ్ఎంసీ ఎన్నికల పెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. డిసెంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సారి మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన్నట్లు తెలిపారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వివరించారు. 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 21న వాటిని పరిశీలిస్తామన్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 1 ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించారు. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: GHMC Elections, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు