muncipal new mayors : వరంగల్‌కు గుండు సుధారాణి, ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ

ఖమ్మం మేయర్ గా పులుకొల్లు నీరజ, వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి

muncipal mayors : మరి కాసేపట్లో మేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌లను ఎన్నుకోనున్నారు. మేయర్ , చైర్మన్ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఎంపికపై కసరత్తు చేశారు. వీరి పేర్లను సీల్డు కవర్‌లో పార్టీ ఇంచార్జులకు పంపించారు.దీంతో మధ్యహ్నం మూడు గంటలకు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు కలిసి మేయర్ , చైర్మన్లను అధికారికంగా ఎన్నుకోనున్నారు.

  • Share this:
మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్, డిప్యూటి మేయర్లతో పాటు, ఐదు మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ మరి కాసేపట్లో కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే మేయర్ అభ్యర్థులపై సీఎం కేసిఆర్ కసరత్తు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల ఇంచార్జులకు పంపించారు. వీరి పేర్లను సీల్డు కవర్‌లో ఎన్నికల ఇంచార్జులుగా నేతలకు ఇప్పటికే అందించనున్నారు. అయితే కౌన్సిల్ సమావేశంలో వారిని అధికారికంగా ప్రకటించనున్నారు.

కాగా వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గాపులుకొల్లు నీరజ పేర్లు ఖరారు అయ్యాయి. ఇక సిద్దిపేట మున్సిపాలిటీకి కడదర్ల మంజుల, జడ్చర్లలో దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్‌లో రాచకొండ శ్రీను, అచ్చంపేటలో నర్సింహగౌడ్‌ ల పేర్లను సీఎం ఖారారు చేశారు.

మేయర్‌, ఛైర్‌ పర్సన్ల ఎంపిక ప్రక్రియకు పరీశీలకులుగా ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిశీలకులుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి , వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , గంగుల కమలాకర్ , కొత్తూరు మున్సిపాలిటీకి పరిశీలకులుగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నకిరేకల్ మున్సిపాలిటీ పరిశీలకులుగా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు సిద్దిపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా మాజీ మేయర్, రవీందర్ సింగ్ ,ఫారెస్టు డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అచ్చంపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జడ్చర్ల మున్సిపాలిటీ పరిశీలకులుగా సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ చైర్మన్  మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలను నియమించగా వారు ఇప్పటికే మేయర్ల ఎన్నిక ప్రక్రియపై స్థానిక నేతలతో సమావేశం అయ్యారు. మూడు గంటలకు ఆయా మున్సిపాలీటిలలో అధికారికంగా మేయర్లను ఎన్నుకోనున్నారు.
Published by:yveerash yveerash
First published: