హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: జనసేనతో పొత్తు ఉంటుందా?.. వచ్చే ఎన్నికలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: జనసేనతో పొత్తు ఉంటుందా?.. వచ్చే ఎన్నికలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్, బండి సంజయ్

పవన్ కల్యాణ్, బండి సంజయ్

Bandi Sanjay: సీఎం కేసీఆర్ తీరును చూస్తుంటే.. ఆయన ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు.  ఎన్నికలు ఎప్పుడొచ్చినా...  ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) ఇంకా ఏడాది సమయముంది.కానీ ఇప్పటి నుంచే ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండాలని తమ పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ (CM KCR) ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. బీజేపీతో ఇక యుద్ధమేనని స్పష్టం చేశారు. అటు బీజేపీ కూడా అదే దూకుడుతో ఉంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో పాటు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టంచేశారు.  బుధవారం బీజేపీ ఆఫీసులో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. పలు అంశాలపై మాట్లాడారు.

సీఎం కేసీఆర్ తీరును చూస్తుంటే.. ఆయన ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు.  ఎన్నికలు ఎప్పుడొచ్చినా...  ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం లక్ష ఓట్లు సాధించేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొత్తులపైనా మాట్లాడారు. జనసేనతో బీజేపీ పొత్తు ఏపీకే పరిమితమని.. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ వచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశమే లేదని.. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.

తన కూతురు కవితను కూడా బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి చేశారని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. ఈ అంశంపై బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్‌నే తాము పట్టించుకోలేదని.. కవితను ఎవరు పట్టించుకుంటారని సెటైర్లు వేశారు. కవితను రాజకీయాల్లోకి లాగడం దారుణమని ఆయన అన్నారు. అడ్డదారిలో మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారని.. ఈసారి అది జరగదని స్పష్టం చేశారు బండి సంజయ్.

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ పెద్దలతో భేటీ కావడంపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారు సొంత పనులపైనే ఢిల్లీకి వెళ్లారని అన్నారు.  బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని.. ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో.. బండి సంజయ్ తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

First published:

Tags: Bandi sanjay, Bjp, Pawan kalyan, Telangana

ఉత్తమ కథలు