Gandhi hospital rape : గాంధీ రేప్‌ పై తేల్చిన పోలీసులు...ఇవి నిజాలు...!

గాంధీ ఆస్పత్రి

Gandhi hospital rape : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాంధీ ఆస్పత్రి సంఘటన నిజాలు బయటపడ్డాయి.. యువతి చెబుతున్నట్టుగా ఎలాంటీ అత్యాచారం జరగలేదని పోలీసులు తేల్చారు.. మహిళల వ్యక్తిగత అవసరం కోసమే ఇదంతా చేశారని చెప్పారు. కేసును చేధించేందుకు ఇందుకోసం 500 సీసీ కెమెరాలతోపాటు సుమారు 800 గంటల సీసీ ఫుటేజిని పరీశీలినట్టు హైదరాబాద్ సీపీ తెలిపారు.

  • Share this:
    గాంధీ ఆస్పత్రి ఘటన అంతా ఫేక్‌ అని పోలీసులు తేల్చారు.. గత ఐదు రోజులుగా జరుగుతున్న అత్యాచారం సంఘటనపై పోలీసులు హైరానా పడ్డారు..ఓ వైపు జాతీయ మహిళ కమీషన్ మరోవైపు మహిళా సంఘాల ఆందోళనల నడమ పోలీసులు అత్యంత సవాలుగా తీసుకుని నిజాన్ని నిగ్గు తేల్చారు.. అత్యాచారం జరగకున్నా యువతి కట్టుకథలు అల్లినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారం ఘటనలో ఇద్దరు మహిళలు చెప్పిన ఫిర్యాదులో వాస్తవం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ అంజన్ కుమార్ మీడియాకు వివరించారు.

    ఇద్దరి అక్కా చెల్లెలకి కలిపిన కల్లు తాగే అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే..ఆసుపత్రిలో ఉన్న కొద్ది రోజులు కల్లు తాగకపోయే సరికి ఇద్దరు చాలా ఒత్తిడికి గురయ్యారని వివరించారు.ఈ సమయంలోనే అక్క బయటికి వెళ్ళిపోయిందని, అక్కని వెతుకు కుంటూ వెళ్ళిన చెల్లి బయట ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ పరిచయం చేసుకుందని వెల్లడించారు.. ఇది జరిగిన రోజే సెక్యూరిటీ గార్డుతో పరస్పర అభిప్రాయంతో 7వ ఫ్లోర్‌లో లైంగికంగా కలిశారని వెల్లడించారు.. ఆ తరువాత మరొకసారి గాంధీ ఆసుపత్రి సెల్లార్‌లో కూడా ఇలాగే జరిగిందని తెలిపారు.. ఈ క్రమంలోనే తన కోసం అక్క కొడుకు రావడంతో నిస్సహయంగా సెల్లార్ పడి ఉండడం చూసి ఇంట్లో తెలియడం వల్ల బాగుండదనే అభిప్రాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు..

    ఇక ఇన్నాళ్లు ఆచూకి లభించకుండా వెళ్లిపోయిన ఆమె అక్క కూడా రెండూ రోజులు పాటు కాగితాలు ఏరుకునే వ్యక్తితోనే గడిపిందని వెళ్లడించారు, కాగా ఈ సంఘటనలో దీనిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ తప్పు ఏం లేనట్లు పోలీసులు తెలిపారు.

    కాగా మొత్తం ఎపిసోడ్‌ను బయటకు తీసేందుకు 500కి పైగాసీసీ కెమెరాలు పరిశీలించినట్లు సీపీ అంజన్ కుమార్ తెలిపారు.దాదాపు 800 గంటల సీసీ ఫుటేజ్‌లు పరిశీలించినట్టు చెప్పారు.., టెక్నాలజీ ఆధారంగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు.

    కాగా అంతకుముందే అక్క ఆచూకి కనుగొనేందుకు నార్త్‌ జోన్‌ పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మహిళను నారాయణగూడలో ఉన్నట్లు గురువారం గుర్తించారు. అదృశ్యమైన మహిళ రెండు రోజులుగా ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, మహిళకు ఆశ్రయం ఇచ్చిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published: