హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | Hyderabad: కేంద్ర మంత్రికి, సీఎం కేసీఆర్​కు మధ్య వార్​..? మూడు లేఖలు రాసినా పట్టించుకోరా అంటూ అసంతృప్తి..

CM KCR | Hyderabad: కేంద్ర మంత్రికి, సీఎం కేసీఆర్​కు మధ్య వార్​..? మూడు లేఖలు రాసినా పట్టించుకోరా అంటూ అసంతృప్తి..

కిషన్​ రెడ్డి, కేసీఆర్​ (ఫైల్​)

కిషన్​ రెడ్డి, కేసీఆర్​ (ఫైల్​)

టీఆర్​ఎస్​, బీజేపీల మధ్య వార్​ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. అయితే ఇది కాస్తా.. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య యుద్ధంలా మారిపోయింది

  టీఆర్​ఎస్ (TRS)​, బీజేపీల (BJP) మధ్య వార్​ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. అయితే ఇది కాస్తా.. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government), కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య యుద్ధంలా మారిపోయింది. తెలంగాణకు రావాల్సిన నిధులు ఆపేస్తున్నారని, అప్పులు పుట్టనివ్వడం లేదంటూ టీఆర్​ఎస్​ (TRS) ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే చాలా ఇచ్చామని వాటిని లెక్కల్లో చూపించడం లేదంటూ ఇటు బీజేపీ వాదిస్తోంది. ఈ గందరగోళంలో తెలంగాణకు రావాల్సిన ఫలాలు దక్కడం లేదనేది వాస్తవం. ఇదే కోవలో ఓ విషయం తెరపైకి వచ్చింది. అదే సైన్స్​ సిటీ (Science City). దీనిని హైదరాబాద్​ (Hyderabad)లో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందంటూ కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy )చెప్పారు. అయితే ఇక్కడే తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు.  హైదరాబాద్ లో సైన్స్ సిటీ (Science City) ఏర్పాటు విషయం పై సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి మడో సారి లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయదలచిన సైన్స్ సిటీ విసయం పై అవసరమైన ప్రతిపాదనను పంపించమని కోరుతూ డిసెంబర్ 2021లో మొదటి లేఖను రాశానని పేర్కొన్నారు.

  సీఎం స్పందించికపోవడంతో.. మళ్లీ ఫిబ్రవరి 22న 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ విషయంపై లేఖ రాశానని పేర్కొన్నారు. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతి స్పందన రాకపోవడంతో.. మే 02.2022లో ఈ విషయం ప్రస్తావిస్తూ మళ్లీ లేఖ రాశానని గుర్తు చేశారు.

  సైన్స్ సీటీ (Science City) ఏర్పాటును సంబంధించిన డీపీఆర్ ను రూపొందించటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సాంకేతిక సహాయం అవసరమైతే.. డైరెక్టర్ జనరల్, ఎన్ఎస్ఎం కలకత్తా వారిని తెలియజేశానన్నారు కేంద్ర మంత్రి. ఈ విధంగా సీఎంకు మూడు సార్లు లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం గారు మీ దగ్గర నుంచి స్పందన రావాలని మళ్లీ ఈ విషయం ప్రస్తావిస్తూ లేఖ రాస్తున్నానని కిషన్ రెడ్డి  సీఎం కు మరో లేఖ (Letter) రాశారు.

  సైన్స్ పట్ల ఎంతో ఆసక్తిని పెంపొందించే..

  ఈ లేఖలో కిషన్​ రెడ్డి సైన్స్​ సిటీ (Science City) ప్రత్యేకతను ప్రస్తావిస్తూ.. ‘‘ CCMB, IICT, CFSL, CDFD, NGRI, NIN, INCOIS, IIIT, DMRL వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలు, శాస్త్రీయ సంస్థలు, IT కి చెందిన అనేక అంతర్జాతీయ సంస్థల పరిశోధన & అభివృద్ధి కేంద్రాలు ఉన్న హైదరాబాద్ నగరం సైన్స్ సిటీని ఏర్పాటు చేయటానికి కావలసిన అన్ని రకాల అర్హతలను కలిగి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులలో, యువతలో సైన్స్ పట్ల ఎంతో ఆసక్తిని పెంపొందించే ఈ సైన్స్ సిటీని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినట్లయితే పర్యాటకంగా కూడా నగరానికి ఒక మంచి గుర్తింపు వస్తుంది.

  ఇప్పటికే దేశంలో ఉన్న కలకత్తా, బెంగుళూరు, ముంబై, కురుక్షేత్ర సైన్స్ సిటీలను ప్రతి రోజూ వేలాది మంది విద్యార్థులు, యువత వారి కుటుంబ సభ్యులు, పర్యాటకులు సందర్శించి సైన్స్ పట్ల ఎంతో ప్రేరణను పొందుతున్నారు,  కాబట్టి, ఈ విషయంలో మీరు వ్యక్తిగత చొరవ చూపించాలి. ఇకపై ఎటువంటి ఆలస్యం జరగకుండా హైదరాబాద్ నగరం నందు సైన్స్ సిటీని ఏర్పాటు చేయడానికి అవసరమైన 25 ఎకరాల భూమితో పాటు, కావలసిన DPR SPOCS మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేత వెంటనే తయారు చేయించి పంపగలరని, తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు సైన్స్ సిటీని చేరువ చేయగలరని ఆకాంక్షిస్తున్నాను”అని లేఖలో  కిషన్ రెడ్డి తెలిపారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Hyderabad, Kishan Reddy, Telangana Government

  ఉత్తమ కథలు