• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • THERE IS NO PROBLEM WITH OUT EETALA RAJENDER IN TRS SAID GANGULA KAMALAKAR VRY KNR

karimnagar : ఈటల పోయినా పార్టీకి నష్టం లేదు..కేసీఆర్ బొమ్మే మనల్ని గెలిపిస్తుంది..మంత్రి గంగుల

karimnagar :  ఈటల పోయినా పార్టీకి నష్టం లేదు..కేసీఆర్ బొమ్మే మనల్ని గెలిపిస్తుంది..మంత్రి గంగుల

గంగుల కమలాకర్ - ఈటల రాజేందర్ (ఫైల్)

karimnagar : హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని మంత్రి గంగుల కమాలాకర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ పార్టీని వీడినా..కేసిఆర్ బొమ్మతోనే పార్టీ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు.

  • Share this:
ఈటల పార్టీని వీడనుండడంతో హుజురాబాద్‌లో పాగా వేసేందుకు టీఆర్ఎస్ ఇప్పటి నుండే పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. భవిష్యత్‌లో ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు సమాయత్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ నేతు కార్యకర్తలెవరు ఈటలతో వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు.

రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు అవకాశాలు ఎర్పడ్డాయి. కరోనా తర్వాత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించిన నేపథ్యంలోనే మరో కొద్ది రోజుల్లో హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ఆటు ఈటల రాజేందర్ తోపాటు ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం హుజురాబాద్ ఎన్నికలపై ఇప్పటినుండే కసరత్తు ప్రారంభించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలను డీకొట్టేందుకు పార్టీ సమయాత్తం అవుతోంది.

దీంతో జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కార్యకర్తలు పార్టీని వీడకుండా వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు.గత ఏడు సంవత్సరాలుగా పార్టీపై ఎలాంటీ వ్యతరేకత లేదని, ఇటివల జరిగిన నాగార్జునా సాగర్ ఉప ఎన్నికల్లో కూడ జానరెడ్డి గెలుస్తారని అంతా భావించారని, కాని కేసిఆర్ బోమ్మతోనే యువకుడైన నోముల భగత్ గెలిచారని చెప్పారు. దీనికి తోడు ఎమ్మెఎల్సీ ఎన్నికల్లో సైతం 70 శాతం యువత టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని అన్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఎప్పుడువచ్చిన టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని వివరించారు. ఏది ఏమైనా..కేసిఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతామని చెప్పారు.

ఈటెల వ్య‌వ‌హారంలో పార్టీ త్వ‌ర‌లోనే అంద‌రితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని, పుట్ట మ‌దు వ్వ‌వ‌హారంలో ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబందం లేద‌ని, హైకోర్టులో వామ‌న్ రావు గారి తండ్రి పిర్యాదు మేరకు చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంద‌ని, జ‌రుగుతున్న వ్య‌వహారాల్లో పార్టీకి ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబందం లేద‌ని మ‌రోసారి పున‌రుద్ఘాటించారు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు