Revanth reddy : పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే.. రైతు బంధు, రైతు బీమాలు అవసరమే లేదు..

Revanth reddy

Revanth reddy : పంటలకు గిట్టు బాటు ధరలు కల్పించకుండా రైతు బంధు, రుణమాఫిలతో ఫలితం లేదని టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. జహిరాబాద్‌లో నిరసన తెలుపుతున్న చెరకు రైతులకు ఆయన సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ఆయన ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.

 • Share this:
  గత రెండు రోజులుగా చెరకు రైతులు జహిరాబాద్‌లో (zahirabad)రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే రైతులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth reddy)సంఘీభావం తెలిపారు. ఈ సంధర్భంగా ప్రైవేటు కంపనీలు చెరకు కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇతర రాష్ట్రాలకు పంపించి కొనుగోలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రైతుల పంటలకు మద్దతు ధర కల్పిస్తే... వారికి రైతు భీమా, రైతు బంధు , రుణమాఫిలు(Ryrthu bheema) కూడా అవసరం లేదని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతు రాజుగా బతుకుతాడని అన్నారు. అయితే రైతుల ప్రయోజనాలు పక్కన పెట్టిన ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి మాత్రం కోట్ల రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వం రైతులకు రివాల్వింగ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో చెరకు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. చెరకు ఫ్యాక్టరీలు నడిపించలేని సీఎం కేసిఆర్ రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

  కాగా రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా జహిరాబాద్‌లో చెరకు రైతులు బంద్ నిర్వహించారు. అందుకోసం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏ రాజకీయ పార్టీ సపోర్టు లేకుండా స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆందోళన చేపట్టడంపై రేవంత్ రెడ్డి ప్రశంసించారు. పంజాబ్, హర్యానాతో కంటే ఎక్కువగా కష్టపడే రైతులు తెలంగాణలో ఉన్నారని ఇలాంటీ వారికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని చెప్పారు.

  ఇది చదవండి : చిన్న పిల్లల మెడపై కత్తులు.. మరో చిన్నారీ గొంతు తెప్పిన తండ్రి


  కాగా అంతకు ముందు జహిరాబాద్ పట్టణ పరిధిలోని బాగారెడ్డి స్టేడియంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డితోపాటు గీతారెడ్డి ,అజారుద్దిన్ తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.

  ఇది చదవడి : మాంసం విక్రయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. విక్రయాలన్ని ప్రభుత్వ ఆధీనంలోకి..

  అయితే రేవంత్ రెడ్డి తనకు సమాచారం ఇవ్వకుండా సంగారెడ్డిలో జిల్లాలో పర్యటించడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ఫైర్ అయ్యారు. దీని ద్వార ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. గజ్వేల్ సభలో కూడా తనను అవమానించారని .. కనీసం స్టేజిపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. రాజకీయాలంటే హిరోయిజం కాదని ఈ సంధర్భంగా హితవు పలికారు. ఇక జహిరాబాద్ సంఘనటతో ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది. కాగా మొదటి నుండి దూకుడుగా వెళుతున్న రేవంత్ రెడ్డిపై పార్టీలో అంతర్గత చర్చ కొనసాగుతోంది.దీంతో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి.
  Published by:yveerash yveerash
  First published: