హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : నక్సలైట్ల ప్లీనరీ ప్రచారంతో డబ్బు వసూలుకు స్కెచ్.. పోలీసుల అదుపులో నిందితులు...

Karimnagar : నక్సలైట్ల ప్లీనరీ ప్రచారంతో డబ్బు వసూలుకు స్కెచ్.. పోలీసుల అదుపులో నిందితులు...

సిరిసిల్ల ఎస్పీ ఎస్పీ రాహుల్ హెగ్డే

సిరిసిల్ల ఎస్పీ ఎస్పీ రాహుల్ హెగ్డే

Karimnagar : కరీంనగర్ జిల్లాలో కలకలం రేపిన జనశక్తి నక్సైలైట్ల ప్లీనరీ గుట్టును పోలీసులు తేల్చారు. కొంతమంది వసూళ్ల కోసమే ఈ ప్రచారానికి తెరలేపినట్టు వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని చెప్పారు.

  అక్రమ వసూళ్ల కోసం ఏకంగా నక్సలైట్ల ప్లీనరీ జరుగుతుందంటూ పత్రికల్లో వార్తలు వచ్చేలా క్రియోట్ చేశారు. అయితే ఇదంతా వసూళ్ల కోసమే కొంతమంది కుట్రకు తెరలేపారని నక్సలైట్ల సమావేశాలు లేవని జిల్లా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ప్రచారానికి కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  గత వారం రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా సరిహద్దు అటవీ ప్రాతంలో జనశక్తి నక్సలైట్ల ప్లీనరీ సమావేశం నిర్వహించినట్లు వివిధ పత్రికల్లో,న్యూస్ ఛానెల్లో ప్రచారం జరిగింది.అయితే అది నిజం కాదని,సిరిసిల్లలో అలాంటి సమావేశాలు ఏవి జరగలేదని జిల్లాలో ఎలాంటి నక్షలైట్స్ సంచారం లేదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ రోజు జరిగిన పత్రిక సమావేశంలో వెల్లడించారు..ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...అసత్య ప్రచారాన్ని తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్న సందర్భంలో బుధవారం రోజున సాయంత్రం వేములవాడ పట్టణ శివారులో కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ గున్నల లక్ష్మణ్, పోలీసులకు పట్టుబడ్డాడు.

  CM KCR : కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు..

  అయితే నిందితుడిని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు.. గున్నల లక్ష్మణ్ ‌తో పాటు జిల్లాలో మరికొంత మందితో కలసి ఒక పథకం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నక్సలైట్ ల సమావేశాలు జరిగాయని అసత్య ప్రచారం చేసి ప్రజలను,వ్యాపారస్తులను, కాంట్రాక్టర్ లను భయబ్రాంతులకు గురి చేసి అక్రమ వసూళ్లకు పాల్పడాలనే దురుద్దేశంతో ఈ అసత్యపు ప్రచారానికి పూనుకున్నట్టు చెప్పారు... కాగా నిందితుని దగ్గర సింగల్ బోర్ తపంచ, ఏడు సెల్స్,ఒక మొబైల్ ,బైక్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు..


  సుమారు పదిహేను రోజుల క్రితం సురేందర్ ,గున్నాల లక్ష్మణ్ మరో ముగ్గురు సహచరులతో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లె గ్రామానికి చెందిన రాజమల్లయ్య అనే వ్యక్తి అక్రమంగా రెండున్నర గుంటల భూమిని ఆక్రమించుకున్నడంటూ... అది మాకు ఇవ్వు లేదంటని అంతు చూస్తామని బెదిరించారు. అతను భూమి ఇవ్వడానికి నిరాకరించడంతో అదే రోజున ఐదుగురు నిందితులు రాజమల్లయ్యను చంపాలని పథకం వేసుకొన్నట్టు చెప్పారు... ఈ క్రమంలోనే వారిని పట్టుకున్నట్టు పోలీసులు వివరించారు..

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Karimnagar, Telangana

  ఉత్తమ కథలు