హోమ్ /వార్తలు /తెలంగాణ /

Yadadri : సింపుల్‌గా యాదాద్రి ప్రారంభోత్సవం..శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరుకు నిరాకరణ.. బదులుగా.. ?

Yadadri : సింపుల్‌గా యాదాద్రి ప్రారంభోత్సవం..శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరుకు నిరాకరణ.. బదులుగా.. ?

Yadadri : సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి దేవాలయ పునర్‌నిర్మాణం తర్వాత, ఆలయ ప్రారంభోత్సవానికి సిద్దమైంది. అయితే నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సీఎం పేరున శిలాఫలకం లేకుండానే ఆలయ ప్రారోంభత్సవం కానుంది.

  తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా పునర్‌నిర్మాణం చేసుకున్న యాదాద్రి ఆలయం ప్రారంభోత్స కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేటి నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగిస్తున్నారు. సుమారు 5 సంవత్సరాల తర్వాత యాదాద్రి మూలవిరాట్టు ప్రజలకు కొద్దిరోజుల్లో దర్శనం ఇవ్వనున్నాడు. అయితే ప్రతిష్టాత్మకంగా ఆలయం పునర్ నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ప్రారోంభోత్సం చేయాలని గతంలో నిర్ణయించారు. ఇందుకోసం పీఎం నరేంద్రమోదిని సైతం ఆహ్వానిస్తామని సీఎం చెప్పారు. కాని ఇటివల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, గత నెల రోజుల క్రితం ముచ్చింతల్‌లో చిన జియర్ స్వామి ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహా ప్రతిష్టాపన సంధర్బంగా నెలకొన్న పరిణామాలు కలిసి యాదాద్రి దేవాలయం ప్రారోంభత్సం చాలా సింపుల్ గా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికి తోడు పూజలు పూర్తైన వెంటనే సాధారణ భక్తులను సైతం అనుమతి ఇవ్వనున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.

  ఈ క్రమంలోనే ఈ నెల 28 ప్రారంభోత్సం కానున్న ప్రధాన ఆలయ నిర్మాణంలో శిలాఫలకం ఏర్పాటు చేసి సీఎంతో పాటు అధికారుల పేర్లు పెడతారు. అయితే శిలాఫలకం నిర్మాణం కోసం సీఎం అంగీంచలేదు. శిలాఫలకం బదులుగా ఓ భారీ పైలాన్ ఏర్పాటు చేయాలని సూచించినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆలయ నిర్మాణానికి కృషి చేసిన సీఎం పేరు మీద శిలాఫలకం లేకుండానే నూతన ఆలయం ప్రారంభించబడనుంది.

  Karimnagar : మాటలు రాని మహిళను విడవని కామంధులు...ఉపాధి కల్పిస్తామని.. 30 రోజులపాటు...!

  మరోవైపు సీఎం ఆదేశాలతో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్యర్యంలో భారీ పైలాన్ నిర్మాణానికి పనులు చకచక కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ పైలాన్‌లో వివిధ అధికారుల పేర్లతో పాటు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న శిల్పుల పేర్లు, ఇతర పండితుల పేర్లను చేర్చాలని సీఎం సూచించారు. దీంతో ఆలయ విశిష్టతను తెలిపే విషయాలు కూడా అందులో పొందుపరచునున్నట్టు సమాచారం.

  కాగా ఇటివల సమతామూర్తి విగ్రహావిష్కరణలో సీఎం కేసీఆర్ పేరు లేకపోవడం కూడా వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.. ఆయన పేరు లేకపోవడం వల్లే పీఎంతో పాటు వెళ్లాల్సిన సీఎం అక్కడికి వెళ్లలేదనే టాక్ వినపడింది. ఈ వివాదంతోనే చినజియర్‌తో విభేదాలకు కారణంగా కూడా తెలుస్తోంది. అయితే దీనిపై నేరుగా చిన జియర్ వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. సీఎం రాకపోవడం వల్లే పేరు పెట్టలేదని వివరించారు. మరోవైపు ఇందులో పొరపాటు కూడా జరిగిందని కూడా ఆయన అంగీకరించిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసినా.. ఆయన మాత్రం హజరు కాలేదు.

  Telangana : పాముకు ఎక్స్‌రే.. ఆ తర్వాత సిమెంట్ పట్టి.. అసలేం జరిగిందంటే...!

  అయితే తానే ముందుండి నిర్మాణం చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణంలో కూడా సీఎం కేసీఆర్ పేరు లేకుండా ప్రధాన ఆలయ ప్రారంభోత్సవ నిర్ణయం తీసుకోవడం వెనక ఏ కారణాలు ఉంటాయనే చర్చ కూడా కొనసాగుతోంది. అందరికి అవకాశాలు కల్పించాలనే యోచనతో పైలాన్ నిర్ణయం తీసుకున్నారా లేక.. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

  First published:

  Tags: CM KCR, Hyderabad, Yadadri temple

  ఉత్తమ కథలు