Huzurabad by election : ఫ్యూజులు వాల్లే తీసేసి.. కరెంట్ తీస్తున్నారని మాపై బురద ..

Huzurabad by election : ఫ్యూజులు వాల్లే తీసేసి.. కరెంట్ తీస్తున్నారని మాపై బురద ..

Huzurabad by election : హుజూరాబాద్ ఎన్నికల రణరంగంలో ఎత్తుకుపైఎత్తులు కొనసాగుతున్నాయి.. ఇన్నాళ్లు ఈటల అనుచరులుగా ఉన్న నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి నేడు టీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి హరీష్ రావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

  • Share this:
    ఇటివల బీజేపీ (bjp )వీడిన హుజూరాబాద్ ( huzurabad by elections ) పట్టణ అధ్యక్షుడుతో పాటు ఈటల రాజేందర్ అనుచరులు టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీష్ రావు ( harish rao )వారికి కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈనేపథ్యంలోనే ఆయన మరోసారి ఈటల రాజేందర్‌పై ( Eetal rajender ) విరుచుకుపడ్డారు. ఈటల రాజేందర్ జూటా మాటలు చెబుతూ... గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు..తాను ఇప్పటి వరకు ఏం చేశాడో భవిష్యత్‌లో ఏంచేస్తాడో చెప్పుకోలేని పరిస్థితిలో ఈటల రాజేందర్ ఉన్నాడని ఆయన ధ్వజమెత్తాడు. దీంతో ఆయనపై సానుభూతి తెచ్చుకోవడం కోసం టీఆర్ఎస్‌పై బురద జల్లుతున్నారని అన్నాడు.

    మరోవైపు సానుభూతి కోసం వాళ్లే ఫ్యూజులు పీక్కోని... సభలకు కరెంట్ కట్ చేస్తున్నరని దుష్ప్రచారం చేస్తున్నారని,వాళ్లే మైక్ కట్ చేసుకుని, టీఆర్ఎస్ వాళ్లు కట్ చేసారని బురుద జల్లుతున్నారని అన్నారు. ఇలా టీఆరఎస్ పై బట్ట కాల్చి మీద వేస్తున్నరని ఫైర్ అయ్యారు.. రాజేందర్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా రక్షణ ఇస్తామని. భయపడాల్సిన అవసరం లేదని ఎద్దెవా చేశారు..

    ఇది చదవండి : గ్రేట్ సీఎం.. సాధారణ ప్రజలతోనే ప్రయాణం.. తన సెక్యూరిటిపై కూడా...!


    గత ఆరు రోజుల నుంచి ప్రతీ రోజు పెట్రోల్, డిజీల్ ధర పెంచారు... మేం ధరలు పెంచాం మాకు ఓటు వేయండి అని చెప్పే పరిస్థితి లేదు.ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేయమని రాజేందర్ అడగలేడని అన్నారు.. ఇక మహిళలను ఓటు అడుగుదామంటే సిలిండర్ ధరలు పెంచారని దుయ్యబట్టారు. దీంతో ఈటల ఓట్లు ఎలా అడుగుతాడని అన్నారు. దీంతో బీజేపీని

    ఇక ఈటల రాజేందర్ కు ఆరు సార్లు 17 ఏళ్లు అవకాశం ఇచ్చామని చెప్పాడు.. ప్రచారం కోసం కేంద్రమంత్రులను తీసుకువచ్చిన ఈటల ఎలాంటీ హామీలు ఇవ్వలేదని, మొన్న బెంగాల్ లో మమతను గెలిపించి బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇక వ్యవసాయ చట్టాలపై విరుచుకుపడిన ఈటల ఇప్పుడు వాటిని సమర్థిస్తున్నారని అన్నారు. ఇక రైతులపై బీజేపీ కేంద్ర మంత్రి కాన్వాయ్ ఎక్కించి రైతులను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. నాలుగు నెలల క్రితమే బీజేపీని విమర్శించిన ఈటల ఇప్పుడు అదే పార్టీని పొగుడుతూ ఓట్లు అడుగుతున్నారని ఎద్దెవా చేశారు. అవకాశం కోసం పార్టీలు ఈటల పార్టీలు మారుతుంటే ప్రజలు మాత్రం ఎందుకు మారాలని ప్రశ్నించారు.

    ఇది చదవండి : షాపింగ్‌ మాల్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారీ ఆచూకి.... లభ్యం.. ఎవరు కిడ్నాప్ చేశారు..?


    మరోవైపు బీజేపీలో పనిచేసే నాయకులనే కాపాడుకోలేని ఈటల రాజేందర్ ప్రజలను ఎలా కాపాడాతారని ప్రశ్నించారు. ఆయన సానుభూతి కోసమే అనేక జూటా మాటలు మాట్లాడుతన్నారని విమర్శించారు. భవిష్యత్ రాజకీయలపై స్పష్టత లేకుండా టీఆర్ఎస్‌పై బురద జల్లుతున్నారని అన్నారు.
    Published by:yveerash yveerash
    First published: