నిజామాబాద్ జిల్లా కోడలు.. సీఎం కేసీఆర్ తన కల్వకుంట కవిత.. జాగృతి అద్యక్షురాలుగా.. ఎంపీ గా.. ఎమ్మేల్సీగా తన సేవాలను అందించారు.. 2019లో జరిగన ఎంపీ ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత వచ్చినా స్ధానిక సంస్థల ఎమ్మేల్సీ ఉప ఎన్నికలో విజయం సాదించారు.. ఆ నాటి నుంచి సీఎం కూతురు కవిత మంత్రి అవుతుందని ప్రచారం జరిగింది.. 2020 అక్టోబర్ నుంచి ఎమ్మేల్సీ హోదలో ఉన్న ఆమెకు సీఎం కేసీఆర్ క్యాబినేట్ లో స్థానం ఖయం అని కవిత ఆనుచరులు బావించారు.. కానీ క్యాబినేట్ విస్తరణ జరగలేదు.. దీంతో ఎమ్మేల్సీ కవిత ఆనుచరుల కోరిక తీరాలేదు..
అయితే మరో సారి ఎమ్మేల్సీగా గెలిచి తప్పకుండా మంత్రి ఆవుతుందని నిన్న మొన్నటి వరకు టాక్.. కానీ సీఎం కేసార్ ఆనుహ్యంగా తీసుకున్న నిర్ణయంతో ఎమ్మేల్సీ కవిత మరో సారి ఎమ్మేల్సీగా ఆవకాశం లేకుండా పోయింది.. అయితే ఆమెను ఏకంగా రాజ్యసభకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. దీంతో ఎమ్మేల్సీ కవిత ఆనుచరులు కోరికున్నట్టుగా ఆమెకు మంత్రిపదవికి ఇక అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది.
అయితే సీఎం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానికి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కుటుంబ పాలన పై ప్రతిపక్షలు చేస్తున్నా ఆరోపణల నేపథ్యంలో వాటిని తిప్పి కోట్టడడంతో పాటు సామాజిక సమీకరణలు కూడా కారణమని భావిస్తున్నారు.. ముఖ్యంగా ఈటల స్థానాన్ని భర్తి చేసేందుకు ఆయన సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్‌కు అవకాశం ఇచ్చారని అంటున్నారు.దీంతో కవితను రాజ్యసభకు పంపడం అనివార్యంగా మారిందని చెబుతున్నారు. అయితే రాజకీయాంగా ఎలాంటీ పరిణామాలు జరిగినా... తమ అభిమాన నాయకురాలిని మంత్రి పదవిలో చూడాలనే ఆమె అనుచరుల కోరిక మాత్రం తీరని కలగానే మిగలనుందని భావిస్తున్నారు.
ఇక ఎమ్మెల్సీగా మరోసారి పోటి చేసేందుకు కవిత ముందుకు రాకపోవడంతోపాటు ఆమె పోటి చేయడం లేదనే నిర్ణయంతో స్థానికంగా ఉండే అనుచరుల్లో ఆశవాహులు పెరిగారు.. దీంతో స్థానిక సంస్థలనుండి మరోసారి అవకాశం కోసం ఆకుల లలితతో పాటు ఎమ్మేల్యే బిగాల గణేష్ గుప్త తమ్ముడు బిగాల మహేశ్ గుప్తా, మాజీ ఎమ్మేల్సీ అరికెల నర్సారెడ్డి బరిలో దిగేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరిని ఆ స్థానం వరిస్తుందో అనేది వేచిచూడాలి.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.