స్తంభించిపోయిన జనజీవనం.. వారి పరిస్థితి ఎట్లానే దానిపైనే సందిగ్ధం

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో హైదరాబాద్ యేతర ప్రాంత వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. మహానగరానికి పలు ప్రాంతాల నుంచి వలసొచ్చిన వారే అధికం. అయితే వారందరికీ స్థానికంగా రేషన్ కార్డులు లేవు. దీంతో ప్రభుత్వం అందించే సాయానికి వీరు దూరమయ్యినట్టే.

news18-telugu
Updated: March 26, 2020, 7:23 PM IST
స్తంభించిపోయిన జనజీవనం.. వారి పరిస్థితి ఎట్లానే దానిపైనే సందిగ్ధం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
“మీకూ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశాం. యాళ్లకు బుక్కెడు తిని ముడుసుకొని పడుకోమంటే మీ బాధేందో నాకు అర్థం కావడం లేదు.. బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి మీడియా సమావేశంలో తెలంగాణ ప్రజలనుద్దేశించి హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన పలువురు తరచూ రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో పైవ్యాఖ్యలు చేశారు. అయితే నిజానికి లాక్ డౌన్‌ను విధిగా పాటిస్తే కరోనా లింక్‌ను సులభంగా తెగ్గొట్టి.. వైరస్‌ను నియంత్రించొచ్చు. అందులో భాగంగానే ఎంత నష్టమొస్తున్నప్పటికీ లాక్ డౌన్‌ను తప్పనిసరి చేశారు.

అయితే ప్రజలు కనీస అవసరాలకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రేషన్ దుకాణాల ద్వారా మనిషికి 12 కేజీల బియ్యంతో పాటు రూ.1500 అందించనుంది. దీనికిగాను ప్రభుత్వం రూ.2417 కోట్లు కేటాయించింది. ఇదిలావుంటే.. రాష్ట్రం మొత్తంలో 87.59 లక్షల తెల్లరేషన్ కార్డులున్నాయి. ఈ కార్డుదారులకు నెలనెలా 1.5 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంది. ఈనెలకు సంబంధించిన కోటాను ఇప్పటికే రేషన్ దుకాణాలకు సరఫరా చేయగా, కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మరో 3.36 లక్షల టన్నుల బియ్యాన్ని ఆయా రేషన్ దుకాణాలకు పంపనుంది. ఇందుకోసం రూ.1103 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇకపోతే ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుకు ఇస్తానన్న రూ.1500కు సంబంధించి రూ.1314 కోట్లు సిద్ధం చేసింది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. హైదరాబాద్ మహానగరానికి తెలంగాణలోని పలు ప్రాంతాల్లోని వారే కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాలక చెందిన వారు ఇక్కడికి బతుకుదెరువు కోసం వచ్చారు. వారందరికీ ఇక్కడ రేషన్ కార్డులు లేవు. దీంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అలాంటి వారు వారి స్వస్థలాలకు వెళ్లలేక.. ఇక్కడ తినేందుకు తిండి దొరక్క అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వారిపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు