దొంగ ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. అడపిల్ల పెళ్లి కోసం కూడపెట్టిన డబ్బుతో పాటు ఆమె కోసం ఉంచిన బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు.. వివరాల్లోకి వెళితే..మీర్‌పేట పోలీసు స్టేషన్ రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉండే నరసింహా భార్య అనారోగ్యం పాలు కావడంతో... ఆమె చికిత్స కోసం కుటుంబ సభ్యులు అందరు ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లారు. కాగా చికిత్స చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇంట్లో దొంగలు పడి పెళ్లి కోసం పెట్టి ఒక లక్ష ఇరవై అయిదు వేల రూపాయల తోపాటు ఇంట్లో ఉన్న 25 తులాల బంగారం సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో పెళ్లి కోసం దాచిన డబ్బులు ఎత్తుకెళ్లడం నర్సింహ కుటుంబం కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం విషయాన్ని స్థానిక మీర్‌పేట పోలీసులు ఫిర్యాదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.