మొన్న పెళ్లికొడుకుతో వివాహం.. నిన్న ప్రియుడితో..

కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన మౌనికకు దేవరకొండకు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 12న వారి వివాహం కూడా జరిగిపోయింది.

news18-telugu
Updated: June 14, 2020, 4:36 PM IST
మొన్న పెళ్లికొడుకుతో వివాహం.. నిన్న ప్రియుడితో..
దీంతో భార్యకు కోపం నషాళానికి ఎక్కింది. అయితే, ‘నా మొగుణ్ణి పర్మినెంట్‌గా నువ్వే ఉంచేసుకో. కానీ, నా జీవితం బాగుండాలి కాబట్టి, ఎంత ఇస్తావో చెప్పు’ అని ప్రతిపాదన తెచ్చింది.
  • Share this:
నల్లగొండ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి ఒకరిని ప్రేమించింది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించింది. పెళ్లీ చేసుకుంది. ఇంతలో అక్కడికి తాను ప్రేమించిన యువకుడు వచ్చాడు. అతడిని గట్టిగా పట్టుకుని ఏడ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ విషయమై పెద్దమనుషుల్లో పెట్టాడు. దీంతో ఆ యువతి ప్రేమ వ్యవహారమంతా పూసగుచ్చినట్టు చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి మరుసటి రోజే ప్రేమించిన యువకుడితో ఆ యువతినిచ్చి వివాహం చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో చోటుచేసుకుంది. ముందుగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న మౌనిక అనే ఓ యువతి.. మర్నాడు తాను మనసిచ్చిన యువకుడిని మనువాడింది.

కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన మౌనికకు దేవరకొండకు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 12న వారి వివాహం కూడా జరిగిపోయింది. అప్పుడే అసలు కథ మొదలైంది. మౌనిక తనకు వరుసకు మామయ్య అయ్యే రాజేశ్​తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు మౌనికకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పే ధైర్యం లేని మౌనిక పెళ్లికి అంగీకరించింది. వివాహమూ చేసుకుంది. కట్​చేస్తే పెళ్లయిన కాసేపటికి అక్కడికి రాజేశ్​ వచ్చాడు.

అతడిని చూసిన మౌనిక.. వెంటనే అతడిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఫలితంగా మౌనికను వివాహమాడిన యువకుడు పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు. రంగంలోకి పోలీసులూ దిగారు. పలు చర్చల తర్వాత తాము ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నామని మగ పెళ్లివారు తేల్చి చెప్పారు. దాంతో ఈనెల 13న రాజేశ్​, మౌనికలు మళ్లీ వివాహం చేసుకున్నారు.
Published by: Narsimha Badhini
First published: June 14, 2020, 4:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading