THE YOUNG MAN WHO FOUGHT THE CORONA EPIDEMIC FOR THREE MONTHS IS DEAD IN SURYAPETA DISTRICT KMM VB
Sad Incident: అతడి చిరునవ్వు ఆ రోజుతో చివరిది అని ఊహించలేకపోయాడు.. సైగలతో పలకరించినా చివరకు..
సత్యనారాయణ రెడ్డి (ఫైల్)
Sad Incident: అతడు వ్యవసాయమంతా ఒంటి చేత్తో నడిపించేవాడు. ఆర్థికంగానూ లోటు లేదు. అమ్మానాన్న, భార్య, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతోంది జీవితం. అలాంటి యువ రైతు కుటుంబంలో కరోనా తీరని శోకం మిగిల్చింది. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. మనిషి ప్రాణంతో ఇంటికొస్తే చాలు అనుకున్న వారి ఆశ అడియాసే అయింది. మూడు నెలల పాటు మహమ్మారితో పోరాడిన ఆ శరీరం అలసిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.
అతడు వ్యవసాయమంతా ఒంటి చేత్తో నడిపించేవాడు. ఆర్థికంగా(Finance)నూ లోటు లేదు. అమ్మానాన్న, భార్య(Wife), ఇద్దరు పిల్లలతో(Two Childrens) హాయిగా సాగిపోతోంది జీవితం. అలాంటి యువ రైతు కుటుంబంలో కరోనా(corona) తీరని శోకం మిగిల్చింది. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. మనిషి ప్రాణంతో ఇంటికొస్తే చాలు అనుకున్న వారి ఆశ అడియాసే అయింది. మూడు నెలల పాటు మహమ్మారితో పోరాడిన ఆ శరీరం అలసిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట(Suryapeta) జిల్లా గరిడేపల్లి మండలం పరెడ్డిగూడెం(Pareddy gudem) గ్రామానికి చెందిన అంబటి సత్యనారాయణరెడ్డి (37) జూలై 15న ఓ శుభకార్యానికి వెళ్లి వచ్చాక అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరీక్ష చేయించగా కరోనా పాజిటివ్(Corona Positive)గా తేలింది.
రెండు రోజులు ఇంటి వద్దే చికిత్స తీసుకోగా.. శ్వాస ఇబ్బంది తలెత్తింది. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడా ఫలితం కనిపించక పోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. రోజురోజుకు ఊపిరితిత్తుల పనితీరు క్షీణించసాగింది. ఊపిరితిత్తుల మార్పిడికి వైద్యులు సూచించారు. ఇందుకోసం రోజుకు రూ.1.80 లక్షలు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఒక్కడే కుమారుడు కావడం, అతడికి చిన్న పిల్లలు ఉండడంతో వారు ఖర్చుకు వెనుకాడలేదు.
తమకు ఉన్న 20 ఎకరాల పొలంలో కొంత విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ముందుగా తెలిసినవారి నుంచి డబ్బు తెచ్చారు. అడిగినంత ఆస్పత్రికి చెల్లించారు. చికిత్సకు స్పందిస్తున్నాడని వైద్యులు చెబుతూ వచ్చారు. కుటుంబ సభ్యులు వెళ్లినప్పుడు సత్యనారాయణరెడ్డి సైగలతో పలుకరించేవాడు. అయితే, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడంతో క్రమంగా ఆయన శరీరం చికిత్సకు స్పందించడం తగ్గింది.
కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌లో లాభం లేదని భావించి చెన్నైలోని మరో ప్రముఖ ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. దీనికోసం ఎయిర్ అంబులెన్స్‌కు రూ.4 లక్షలు చెల్లించేందుకూ అంగీకరించారు. కానీ, ఆస్పత్రి వైద్యులు దానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో సత్యనారాయణరెడ్డి ఆరోగ్యం ఇంకా క్షీణించడంతో మృతి చెందాడు. ప్రైవేటు ఆస్పత్రి వారు మొత్తం రూ.1.46 కోట్లు బిల్లు చేయగా.. రూ.33 లక్షలు తగ్గించారు. మిగతా రూ.1.13 కోట్లను కుటుంబ సభ్యులు చెల్లించారు. కాగా, సత్యనారాయణరెడ్డికి తల్లిదండ్రులు శివారెడ్డి, సైదమ్మ, భార్య జ్యోతి కూతురు నవనీత, కుమారుడు సుశాంక్‌రెడ్డి ఉన్నారు.
ఈ విషాద ఘటనతో గ్రామస్తులతో పాటు కుటుంబసభ్యలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆ గ్రమం అంతా విషాఛాయలు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు నివారణ ఒక్కటే మార్గం అని.. ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యలు సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.