Home /News /telangana /

THE WOMAN FROM MAHABUBABAD HAS BEEN MARRIED NINE TIME AND NINTH HUSBAND CAUGHT HER PRV

Nine Marriages: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిల్లు చేసుకున్న మహిళ.. ! వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యమలీల సినిమా చూశారా? అందులో తనికెళ్ల భరణి ఓ కవిత రాస్తాడు. చెల్లికి జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ.. అని ఇక్కడ అదే డైలాగ్​ను ఓ మహిళ ఆదర్శంగా తీసుకున్నట్లు ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది.

    యమలీల సినిమా చూశారా? అందులో తోట రాముడి పాత్ర వేసిన తనికెళ్ల భరణి ఓ కవిత రాస్తాడు. నాకో బుల్లి చెల్లి..  చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అని ఇక్కడ అదే డైలాగ్​ను ఓ మహిళ ఆదర్శంగా తీసుకున్నట్లు ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు (Nine Marriages) చేసుకుంది. ఆ నిత్య పెళ్లికూతురు చిట్టాను తొమ్మిదో భర్త (Ninth Husband) బయటపెట్టాడు. తనకు విడాకులు ఇవ్వాలని కోరాడు. అయితే ఆ మహిళ భర్తకు విడాకులు ఇవ్వకుండా.. అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది. మరి ఆ మహిళ తొమ్మిది పెళ్లిళ్ల  కథ ఒకసారి తెలుసుకుందాం..

    తెలంగాణలోని మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా మహిళకు.. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra pradesh) కృష్ణా జిల్లా గంపలగూడెంకు చెందిన వ్యక్తితో మ్యాట్రిమోని వెబ్‌సైట్​లో వివరాలు చూసుకుని పరిచయం పెంచుకున్నారు. అయితే ఆ పరిచయం పెళ్లి వరకు దారితీసింది. మూడేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. బెంగళూరులో ఈ జంట కాపురం పెట్టింది. పెళ్లి జరిగిన తర్వాత కొన్ని నెలల పాటు మాత్రమే వీరు కలిసి ఉన్నారు. అయితే మహిళ తరచూ ఫోన్​లో కోర్టు విషయాల గురించి మాట్లాడుతూ ఉండేదని ఆమె భర్త చెప్పాడు. ఏంటని అతను ప్రశ్నిస్తే గొడవకు దిగేదని తెలిపాడు. ఇలా నడుస్తున్న ఆమె అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లిందని.. తిరిగి వెళ్లి వచ్చాకా మరోసారి హైదరాబాద్ వెళ్తానని అనడంతో ​ అనుమానంతో ఆరా తీసినట్టుగా మహిళ భర్త చెబుతున్నాడు.



    పెళ్లిళ్లు తెలిసేసరికి షాక్​..

    ఈ క్రమంలోనే ఆమె తన కంటే ముందు 8 మందిని పెళ్లి చేసుకున్నట్టుగా తెలిసింది భర్తకు. దీంతో దిమ్మదిరిగిపోయింది సదరు భర్తగారికి. ఇక ఆమెతో కలిసి జీవించలేనని భావించి విడాకులు కోరారని భర్త గారు తెలిపారు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదని భర్త చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ.. భర్త నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తే నిత్య పెళ్లికొడుకు అని ఆరోపించడం కొసమెరుపు.

    Black magic: రాజధానిలో క్షుద్ర పూజల కలకలం.. సమాధి వద్ద తహసీల్దార్​ ఫొటో పెట్టి..

    తనకు న్యాయం చేయాలని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ముందు మహిళ బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ భర్త.. అతడు సేకరించిన ఆధారాలను పోలీసుల ముందు ఉంచాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఇద్దరి  ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. చూశారు కదా.. ఈ రోజుల్లో పెళ్లి అంటే అందరికీ ఓ సరదా వ్యాపకమో.. కొన్ని రోజులు జీవించి.. కట్నం తీసుకుని వెళ్లిపోవడమో.. లేదా భరణంతో జీవించడానికి ఓ ఆయుధంలా మారిపోయింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cheating, Mahabubabad, Marriage, WOMAN

    తదుపరి వార్తలు