హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad Story: అయ్యో.. తల్లి.. పాఠాలు చెప్పే నిన్ను అనుమానించాడని అంతటి కఠిన నిర్ణయం తీసుకుంటావా? 

Sad Story: అయ్యో.. తల్లి.. పాఠాలు చెప్పే నిన్ను అనుమానించాడని అంతటి కఠిన నిర్ణయం తీసుకుంటావా? 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్య కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ కాలేజీలో అధ్యాపకురాలు గా పనిచేస్తుంది, భర్త ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు, కానీ వారిరువురి మధ్యలోకి వచ్చిన అనుమానం ఓ చావుకు దారితీసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Sayyad Rafi, News18, Mahbubnagar)


  భార్య (Wife), భర్త (Husband) ఇద్దరు ఉపాధ్యాయులు, ఎంతో మంది విద్యార్థులకు బోధనలు చెప్పి సరైన బాటలు నడిపించాల్సిన బాధ్యత వారిది. భార్య కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ కాలేజీలో అధ్యాపకురాలు గా పనిచేస్తుంది, భర్త ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు, అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ అధ్యాపకురాలి మీద పెట్టుకున్న అనుమానంతో ఆ ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయుడు భార్యకు వేధింపులు మొదలుపెట్టాడు.  భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు (Wife Suicide) పాల్పడింది.


  పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ (NagarKurnool) జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని తాళ్ల నరసింహపురంకు చెందిన సుజాత క్రాంతి కుమార్ తో 9 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఓ బాబు పాప ఉన్నారు. సుజాత కొల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో లెక్చరరుగా పనిచేస్తూ జీవితం కొనసాగించుకునేవారు. భర్త క్రాంతి కుమార్ కొల్లాపూర్ మండల పరిధిలోగల పెంట్లవెల్లి మండలం కేంద్రంలో ని ఓ ప్రైవేటు పాఠశాలలో క్రాంతి కుమార్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా సుజాతను  భర్త  క్రాంతి కుమార్ అనుమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు.  కొన్ని సందర్భాలలో పెద్దల సమక్షంలో మాట్లాడి క్రాంతి కుమార్ కి సర్ది చెప్పి కాపురానికి పంపారు. అయినా క్రాంతి కుమార్లో మార్పు రాలేదు. దీంతో పక్కనే ఉన్న కోడేరు మండలం నరసయ్య పల్లి గ్రామంలో ఉంటున్న తల్లి అలివేలు వచ్చి కూతురు సుజాతకు తోడుగా ఉంటోంది.. రాత్రి 10 గంటల సమయంలో  దుర్భాషలాడుతూ సుజాతను భర్త క్రాంతి కుమార్ త్రివంగా కొట్టడంతో సుజాత ఆ దెబ్బలకు భరించలేక ఇంట్లో ఉన్న మందులను మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితికి చేరిన సుజాతను తన తల్లి బంధువులు నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం ఉండటంతో హైదరాబాద్​లోని గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. సుజాత సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


  Nagarkurnool: గొర్రెలు అమ్మిన సొమ్ము దొంగల పాలు: పట్టపగలే గొర్రెల కాపరి ఇంట్లో భారీ చోరీ


  ఎనిమిది నెలల క్రితం వివాహం..


  ఏపీలో గతంలో ఇలాంటి ఘటనే జరిగింది.  వీరులపాడు మండలం అల్లూరుకు చెందిన గుంజి వెంకటేశ్వరరావు(23), పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన శ్రావణి(21) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రావణి పుట్టింట్లో జరిగే ఓ ఫంక్షన్‌కు హాజరయ్యే విషయంలో శ్రావణి, వెంకటేశ్వరరావు ల మధ్య చిన్నపాటి వివాదం జరిగింది.


  దీంతో శ్రావణి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. భార్య శ్రావణి పరిస్థితి విషమంగా ఉండడంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వరరావు ఆస్పత్రి ఎదుటే పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దంపతులిద్దరూ చనిపోయారు. కాగా, శ్రావణి ప్రస్తుతం గర్భిణీ అని బంధువులు పేర్కొన్నారు. బంధువులు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Nagarkurnool, Wife suicide

  ఉత్తమ కథలు