హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana News: సార్.. మీకు కాళ్లు మొక్కుతా.. మమ్మల్ని చావమంటారా..? ఏం జరిగిందంటే..

Telangana News: సార్.. మీకు కాళ్లు మొక్కుతా.. మమ్మల్ని చావమంటారా..? ఏం జరిగిందంటే..

Telangana News: మల్లన్న సాగర్ ముంపు గ్రామం ప్రజలకు నష్ట పరిహారం అందలేదని.. అధికారుల చుట్టూ తిరుగుతున్నా నష్ట పరిహారం డబ్బులు ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. మాకు ఉన్న ఆస్తి మల్లన్న సాగర్ లో పోయిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పి నా.. మాకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని మల్లన్న సాగర్ ముంపు గ్రామం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  (K.Veeranna,News18,Medak)

  మల్లన్న సాగర్ ముంపు గ్రామం ప్రజలకు నష్ట పరిహారం అందలేదని.. అధికారుల చుట్టూ తిరుగుతున్నా నష్ట పరిహారం డబ్బులు ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. మాకు ఉన్న ఆస్తి మల్లన్న సాగర్ లో పోయిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పి నా.. మాకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని మల్లన్న సాగర్ ముంపు గ్రామం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో మాకు న్యాయం జరగడం లేదంటూ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు అధికారులతో వాగ్దానానికి దిగారు. తమ సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదని అధికారులను ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం మండలం పల్లెపాహాడు గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు.

  Siddipeta Collector: సిద్దిపేట కలెక్టర్‌గా హనుమంతరావు.. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ.. ఖారారు చేసిన కేసీఆర్..

  పల్లెపహాడు గ్రామస్తులంతా అధికారులతో మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని గ్రామస్తులంతా ఏకమై ఆర్డీఓను నిలదీశారు. ప్యాకేజీలు ఇస్తామని అధికారులు నమ్మించారని.. తామంతా నమ్మి మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూములు ఇస్తే ఇప్పటి వరకు నష్ట పరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్కులు ఇచ్చేందుకు అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు ప్రజావాణిలో సమస్యలు తెలిపినా భూనిర్వాసితుల డబ్బులు మాత్రం రాలేదని చెబుతున్నారు.

  Chief Minister KCR: దళితులకు గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.250 కోట్లు విడుదల..

  ఈ విషయం గురించి అధికారులకు చెప్పినా.. వాళ్లు మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజావాణిలో అధికారిని ఓ వృద్ధుడు నిలదీశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రావడంతో పోలీసుల కాళ్ళు మొక్కుతూ..మాకు న్యాయం చేయండి అంటూ కాళ్లు మొక్కుతూ కనిపించారు. ఇలా పోలీసుల కాళ్ళపై పడి తమ గోడును వెళ్లబోసుకున్నారు. పరిహారం డబ్బులు ఇవ్వకపోతే మాకు చావే శరణ్యం అంటూ వాపోయారు. అనంతరం పోలీసులు వాళ్లకు నచ్చజెప్పడంతో అక్కడి నుంచి భూ నిర్వాసితులు వెళ్లిపోయారు.

  Went To Park: ఎప్పటిలాగే సాయంత్రం పార్క్ కు వెళ్లింది.. కానీ తిరిగి రాలేదు.. అక్కడ ఆమెతో పాటు..

  చావు తప్ప మరొక మార్గం లేదు అంటున్న ఓ మహిళ..

  మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసం స్థలాన్ని వదిలి పెట్టి వచ్చాము.. అధికారులు మా భూములు తీసుకొని ఇంత వరకు తమకు ప్యాకేజీ ఇస్తామని అని చెప్పారు.. కానీ ఏడు నెలలు అవుతున్నా ఇంత వరకు చెక్కులు ఇవ్వలేదు. చెక్కులు ఇవ్వాలని కోరితే అధికారులు పట్టించుకోవడంలేదని.. భూమి పోయినందుకు మాకు వచ్చే నష్టపరిహారం రూ. 9.98 లక్షలు మంజూరు అయింది కానీ.. అధికారులు మాత్రం రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఇస్తామని చెప్తున్నారు.

  Five Students: ముగ్గురు పిల్లలు బట్టలు లేకుండా పరుగెత్తారు.. ఏంటా అని గ్రామస్తులు చూసేసరికి షాక్..

  మంజూరైన డబ్బులను ఎందుకు ఇవ్వరు.. మా ఊరు మొత్తం మునగ లేదు కానీ అక్కడ మాత్రం అధికారులు మమ్మల్ని ఉండనివ్వడం లేదంటూ నిర్వాసితులు వాపోతున్నారు. మాకు వచ్చే నష్ట పరిహారం చెక్కులను త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు మల్లన్న సాగర్ ముంపు గ్రామ పల్లెపహాడ్ గ్రామస్తులు. నష్ట పరిహారం చెక్కులు ఇవ్వకపోతే మాకు చావే శరణ్యం అని.. తాము చచ్చేదాక మాకు న్యాయం జరిగేట్లు లేదంటూ వాపోతున్నారు.

  First published:

  Tags: Mallanna, Medak, Medak Dist, Medak District news, Telangana News

  ఉత్తమ కథలు