ఆదిలాబాద్ లో ప్రశాతంగా ముగిసిన సహకార ఎన్నికలు...కారుదే జోరు...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో అక్కడక్కడ స్వల్ప వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మిగిలిన అంతటా ప్రశాంతంగా ముగిశాయి.

news18-telugu
Updated: February 15, 2020, 10:44 PM IST
ఆదిలాబాద్ లో ప్రశాతంగా ముగిసిన సహకార ఎన్నికలు...కారుదే జోరు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చదురు ముదురు సంఘటనలు మినహా సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ స్వల్ప వివాదాలు, ఘర్షణ నెలకొనగా పోలీసుల జోక్యం తో సద్దు మనిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో అక్కడక్కడ స్వల్ప వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మిగిలిన అంతటా ప్రశాంతంగా ముగిశాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలో సహకార ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల లోపు 144 సెక్షన్ అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి టిఆర్ఎస్ పార్టీ నుండి రెబల్ గా బరిలో ఉన్న అభ్యర్థులు నిరంజన్ గుప్త, నర్సింగరావు ల ఇరువర్గాలు ఘర్షణలు దిగి కొట్టుకోవడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలిసులు ఇరువర్గాల ను చెదరగొట్టి ఘర్షణ లను అదుపులోకి తీసుకువచ్చారు.

కాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సహకార ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ తెరాస ,బిజేపి నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. మూడవ బూత్ వద్ద బిజెపి నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని తెరాస నాయకులు అడ్డుకోవడంతో బిజెపి తెరాస నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ఓటు లేకున్నా గాని ఓట్లు వేస్తున్నారని తెరాస నాయకులు మండిపడ్డారు. పోలీసులు అక్కడికి వచ్చి సదరు వ్యక్తులను బయటికి పంపారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు