Home /News /telangana /

THE TRS PARTY HAS SUSPENDED VANAMA RAGHAVAN FOLLOWING ALLEGATIONS THAT HE WAS INVOLVED IN THE SUICIDE CASE OF PALVANCHA RAMAKRISHNA FAMILY PRV

Vanama Raghava: వనమా రాఘవను సస్పెండ్​ చేసిన టీఆర్​ఎస్​ పార్టీ.. పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో చర్యలు

Vanama Raghava

Vanama Raghava

గత కొద్దిరోజులుగా పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు కారణమని వీడియో లభించడంతో అల్లకల్లోలమైంది. దీంతో టీఆర్​ఎస్​ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది.

టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ (Vanama Raghava)ను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ (Suspended) చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమాను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌చార్జ్ నూకల నరేష్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని ఈ మేరకు టీఆర్ఎస్(TRS) అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. కాగా, గురువారం రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు- లేఖ రాశాక పోలీసులు అరెస్టు (Arrest) చేశారనే ప్రచారం జరిగింది. మరోవైపు రాఘవను అరెస్టు చేయలేదని పాల్వంచ ఏసీపీ ప్రకటించడంతో అయోమయం నెలకొంది. ఇవాళ చూస్తే పోలీసులు ఇంటికి నోటీసులు అంటించారు. మధ్యాహ్నం పన్నెండున్నరకల్లా.. లొంగిపోవాలన్నారు. కానీ వనమా జాడ ఇంత వరకూ దొరకనే లేదు. ఇంతకీ రాఘవ విశాఖలో ఉన్నట్టా? రాజమండ్రిలోనా? లేక హైదరాబాద్ లోనే ఉన్నాడా? లేక మరేదైనా చోటుకు పారిపోయాడా అన్నది తేలాల్సి ఉంది.

ఏం జరిగింది..?

ఏడాదిగా రామకృష్ణ కుటుంబం (Ramakrishna family)లో ఉమ్మడి ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ విషయంలో రామకృష్ణ తల్లి సూర్యావతి వనమా రాఘవను కలిసింది. ఉమ్మడి ఆస్తిని అమ్మగా వచ్చిన సొమ్మును- ముగ్గురూ కలసి పంచుకోండి. అదే సమయంలో ఒక కొడుకుగా తల్లిని చూస్కోవల్సిన బాధ్యత రామకృష్ణదే అని రాఘవ తీర్పిచ్చాడు.

ఈ తీర్పు తనకు అనుకూలంగా లేదని రామకృష్ణ వాపోయాడు. అయితే నీ భార్యను ఒంటరిగా హైదరాబాద్ పంపమని రాఘవ.. రామకృష్ణకు హుకుం జారీ చేశాడన్నది ఆరోపణ. ఇదే విషయాన్ని సెల్ఫీ వీడియోలో వివరించాడు రామకృష్ణ.రాఘవ వ్యవహార శైలి కారణంగా ఒక ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడంటే.. సీనేంటో ఊహించుకోవచ్చు. ఇక రాఘవపై 2006లో తొలిసారి అధికారికంగా కేసు నమోదయ్యింది. తర్వాత 2013- 2017- 2020-2021- 2022 .. ఇలా వరుస సంవత్సరాల్లో వరుస కేసులు నమోదయ్యాయి.

పలువురి ఆత్మహత్యలకు సంబంధించి రాఘవేంద్రరావు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జ్యోతి అనే గిరిజన మహిళకు చెందిన స్థలవివాదంలో రాఘవేంద్రరావు అనుచరులు ఆమెపై భౌతికదాడికి పాల్పడ్డారు. ఎస్టీ మహిళపై హత్యాయత్నం విషయంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొనగా... ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకు వెళ్లటం గతంలో సంచలనం రేపింది. పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో రాఘవేంద్రరావు ఏ-1 ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాదాపు 20 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి, హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసి మళ్లీ కేసు నుంచి బయటపడ్డారు.

యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం..?

ఇవే కాకుండా నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తారన్న విమర్శలు ఆది నుంచీ ఎదుర్కొంటున్నారు. పార్టీని, అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తారని ఆరోపణలున్నాయి. వ్యక్తిగత పంచాయతీల నుంచి భూవివాదాలు, సెటిల్మెంట్లలో రాఘవ జోక్యంతో అనేక వివాదస్పద ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

అంతేకాకుండా పాల్వంచ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాఘవపై భారీ ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అంగుళం భూమి కనిపించినా వదలడనీ- ఆడ గాలి తగిలిందంటే విడిచిపెట్టడనీ- అధికారులంటే లెక్కే లేదనీ టాక్. మామూలు మనుషులే కాదు- పోలీసులూ ఇతడి కారణంగా సూసైడ్ చేస్కున్నారని చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని ఎన్నెన్నో ఆగడాలు సృష్టించాడనీ అంటున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Crime news, Khammam, Vanama

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు