Home /News /telangana /

THE TRS PARTY HAS SUSPENDED SHEIKH SAJID WHO IS FACING CHARGES IN A RAPE CASE AGAINST A NIRMAL MINOR GIRL PRV

Minor girl rape: మైనర్​ బాలికపై టీఆర్​ఎస్​ లీడర్ అత్యాచారం ఘటన.. రంగంలోకి దిగిన టీఆర్​ఎస్​ నాయకత్వం.. చర్యలకు సిద్ధం

సాజిద్​ ఖాన్​ (ఫైల్​ ఫొటో) వృత్తంలో

సాజిద్​ ఖాన్​ (ఫైల్​ ఫొటో) వృత్తంలో

మైనర్ బాలిక (Minor girl)పై అత్యాచారం ఘటనలో నిర్మల్ (Nirmal ) టీఆర్​ఎస్​ లీడర్​ షేక్ సాజిద్‌‌ పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఆయనను సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది.దీంతో పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగింది.

ఇంకా చదవండి ...
    మైనర్ బాలిక (Minor girl)పై అత్యాచారం ఘటనలో నిర్మల్ (Nirmal ) మున్సిప‌ల్ వైస్ చైర్మన్‌ షేక్ సాజిద్‌‌ (Municipal Vice Chairman Sajid Khan)  పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. అధికార టీఆర్‌ఎస్‌ (TRS leader)కు చెందిన షేక్ సాజిద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ పార్టీ సాజిద్‌పై చర్యలకు ఉపక్రమించింది. ‌సాజిద్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది.  మైనర్ బాలికను ఆత్యాచారం (Minor girl rape) చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మ‌ల్ మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ షేక్ సాజిద్ ను టీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి (Minister Indrakaran reddy) తెలిపారు. సాజిద్ పై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసిన‌ట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. సోమ‌వారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మ‌రోవైపు అత్యాచార ఘటనను హేయమైన చర్యగా ఖండించారు. బాధితురాలికి (Victim) న్యాయం జ‌రిగేలా చూస్తామని తెలిపారు. మైనర్ బాలిక‌పై అత్యాచారం చేసిన‌ట్లు సాజిద్ పై ఫిర్యాదు చేసిన వెంట‌నే పోలీసులు పోక్సోచ‌ట్టం కింద‌ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టార‌న్నారు.

    ఏం జరిగింది?

    టీఆర్‌ఎస్ నేత, నిర్మల్ (Nirmal) మున్సిపల్ వైస్ చైర్మన్‌ సాజిద్ ఖా‌న్‌ (Municipal Vice Chairman Sajid Khan) ఈ అఘాయిత్యం చేశాడు. మైనర్ బాలికపై అత్యాచారం (Minor girl rape) కేసులో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సాజిద్ ఖాన్‌ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సాజిద్ ఖాన్‌పై పోక్సో (POCSO), అత్యాచారం కేసు (rape) నమోదు చేసినట్టుగా తెలిపారు. మూడు, నాలుగు బృందాలను నిందితుడిని పట్టుకోవడానికి ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఎంతటివారైనా సరే చట్టం ముందు సమానమేనని అన్నారు.

    మొదట బాలల సంరక్షణ విభాగాన్ని సంప్రదించింది. నిర్మల్​ మున్సిపల్ వైస్​ చైర్మన్ సాజిద్ ఖాన్ గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు బోరుమంది. ఆ బాలిక.. బాలల సంరక్షణ అధికారుల సాయంతో శనివారం రాత్రి నిర్మల్ (Nirmal) రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం బాలికపై అత్యాచారం జరిగిన విషయం వాస్తవమని తేలిందని పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, సాజిద్ ఖాన్ బాలికకు మాయమాటలు చెప్పి.. గత నెలలో పలుమార్లు లైంగిక దాడికి (Minor girl rape) పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Minor girl raped, Nirmal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు