Home /News /telangana /

Police Station: పోలీస్ స్టేషన్ లోనే ఇలా చేశారు.. అవాక్కయిన పోలీసులు.. అసలేం జరిగింది..

Police Station: పోలీస్ స్టేషన్ లోనే ఇలా చేశారు.. అవాక్కయిన పోలీసులు.. అసలేం జరిగింది..

తెలంగాణ పోలీస్ లోగో

తెలంగాణ పోలీస్ లోగో

Police Station: ఆ బైక్ ఖరీదు. అక్షరాలా ఒక లక్షా అరవై ఐదువేల రూపాయలు. (రూ.1 లక్ష 65వేలు) వెర్షన్‌ NH200 పల్సర్.. మోడల్‌ 2020. రిజిస్ట్రేషన్‌ నెంబరు.. టిఎస్‌07 హెచ్‌ఎల్‌ 5714. యూత్‌కు ఎంతో క్రేజ్‌ ఉండే ఈ బైక్‌ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్‌18 తెలుగు)

  అనుమానిత వ్యక్తి దగ్గర స్వాధీనం చేసుకున్న బైక్‌ను నిజానికి సొంతదారునికి ఇచ్చేయాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు రిజిస్ట్రేషన్‌ నంబరు ఆధారంగా అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ సేకరించి.. వచ్చి బండి తీసుకుపోండంటూ సమాచారం ఇచ్చినా.. సదరు బైక్‌ను హ్యాండోవర్‌ చేసుకున్న ముదిగొండ పోలీస్‌స్టేషన్‌ బాధ్యులు మాత్రం తమ వద్ద ఇప్పుడు బైక్‌ లేదంటున్నారు. అదేంటి.. పోలీస్‌స్టేషన్‌లో బైక్‌ మాయం కావడం ఏంటి.. ? అదే ఇక్కడి విశేషం మరి. నిజానికి కొత్త బైక్ పై కన్నేసిన వ్యక్తులు ఏకంగా పోలీస్ స్టేషన్లో బైక్ నే మాయం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ హయత్ నగర్ లో మార్చి 13న NH200 పల్సర్ బైక్ మాయమైంది. అదే బైక్‌ మీద పోతున్న ఓ వ్యక్తిని అనుమానంతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం వద్ద ఏప్రిల్ 4న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న పల్సర్ బైక్ ను సీజ్ చేసి ముదిగొండ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ బైక్‌ రిజిస్ట్రేషన్‌ నెంబరు ఆధారంగా వివరాలు సేకరించి.. బైక్‌ ఓనర్‌ బోయపల్లి స్వామిగౌడ్‌కు ఫోన్‌ చేసి బైక్‌ తీసుకెళ్లమని సూచించారు. అనంతరం ఇక్కడికొచ్చిన స్వామిగౌడ్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది.

  అక్కడి పోలీస్ సిబ్బంది స్టేషన్లో బైక్ మాయమైందని చెప్పుకొచ్చారు. స్వామిగౌడ్‌ తన బైక్‌ దొంగతనానికి సంబంధించి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మార్చి14న ఫిర్యాదు చేశారు.. కేసు నమోదైంది. ముదిగొండ పోలీస్ స్టేషన్ లో బైక్ ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న బైక్ యజమాని స్వామి గౌడ్ హైదరాబాద్ నుంచి బైక్ రిలీజ్ కోసం ముదిగొండ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కానీ బైక్‌ తమ వద్ద లేదంటూ సదరు యజమానికి అక్కడి సిబ్బంది తెలపడంతో ఖంగుతినడం అతనివంతయింది. అయితే దొరికిన బైక్‌ జాబితా ఫొటోల్లో తన బండి ఫోటోను గుర్తించిన స్వామిగౌడ్‌కు పోలీసుల చెబుతున్న మాటలపై అనుమానం వచ్చింది. బైక్‌ దొరికింది.. తీసుకెళ్లండంటూ ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చిన పోలీసులు ఇలా బైక్‌ సంగతి తమకు తెలీదని చెబుతుండడంతో స్వామిగౌడ్‌ గందరగోళానికి గురవుతున్నారు. ప్రజలకు, ప్రజా సంపదకు భద్రత కల్పించాల్సిన పోలీసులే ఇలా చేయడం.. ఏకంగా స్టేషన్‌లోని బైక్‌ మాయమైందని చెప్పడం నమ్మశక్యంగా లేదని వాపోతున్నాడు. నిత్యం పోలీసులు ఉండే పోలీస్ స్టేషన్లో దొంగతనానికి గురైన బైక్ మాయమవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. బాధితుడు స్వామిగౌడ్‌ మాట్లాడుతూ తన బైక్‌ తీసుకెళ్లడానికి ముదిగొండకు మేనెల మొదటివారంలో వచ్చానని.. తనకు సమాచారం ఇచ్చిన టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ రాజును కూడా సంప్రదించానన్నారు.

  అయితే ముదిగొండ పోలీసులు మాత్రం బైక్‌ విషయం తెలీదని చెప్పారని వాపోయారు. ఈ విషయమై సంబంధిత ఖమ్మం రూరల్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డిని 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆరా తీయగా, బైక్‌ను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించిన మాట నిజమేనన్నారు. అయితే ఓనర్‌కు సమాచారం ఇచ్చి, బండి అప్పగించే సమయానికి బైక్‌ కనిపించని విషయం కూడా నిజమేనన్నారు. అయితే ఈ విషయంలో పోలీస్‌స్టేషన్‌ అధికారులు, సిబ్బందిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు నిజంకావన్నారు. కొంత మంది సస్పెక్ట్స్‌ పేర్లు తమ దృష్టికి వచ్చాయని, రెండుమూడు రోజుల్లో విషయాన్ని నిగ్గుతేలుస్తామని స్పష్టం చేశారు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:Veera Babu
  First published:

  Tags: Bike robbery, Crime, Crime news, Hyderabad, Khammam, Robbery, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు