Home /News /telangana /

THE THIEF CHALLENGED THE HYDERABAD POLICE IN RAJASATAN VRY

Theif Trouble : వీడు మాములు కార్ల దొంగ కాదు...! హైదరాబాద్ పోలీసులకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..

Theif Trouble : వీడు మాములు కార్ల దొంగ కాదు...! హైదరాబాద్ పోలీసులకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ( ఫైల్ ఫోటో )

Theif Trouble : వీడు మాములు కార్ల దొంగ కాదు...! హైదరాబాద్ పోలీసులకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ( ఫైల్ ఫోటో )

Theif Trouble : దోంగలను పట్టుకోవడంలో ఆరితేరిన హైదరాబాద్ పోలీసులకే ఓ కార్ల దోంగ చుక్కలు చూపించాడు...దొంగను వెకుంటూ ఇతర రాష్ట్రానికి వెళ్లిన పోలీసులకు తన అతితెలివిని ప్రదర్శించి..సినిమా ఫక్కిలో డైలాగులు కొట్టాడు..

వివరాల్లోకి వెళితే... గతంలో ఓ సిని నిర్మాత విలువైన కారును నగరంలో అంత్యంత సంపన్నులు ఉండే హోటల్‌లో పార్క్‌ చేయగా దొంగించబడింది.. అయితే ఆ దోంగ ఆచూకి కనుక్కొని రాజస్థాన్‌కు వెళ్లిన హైదరాబాద్ పోలీసులకు సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. సాధారణంగా క్రిమినల్స్‌ను పట్టుకునేప్పుడు పోలీసులు వారికి తెలియకుండానే ఉచ్చులోకి దింపి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంటారు.. ఒకవేళ విషయం లీక్ అయి నేరం చేసిన వారికి తెలిస్తే... పోలీసుల కంటబడకుండా తప్పించుకుని పారిపోతాడు...

కాని కారు దోంగ కోసం రాజస్థాన్ వెళ్లిన హైదరాబాద్ పోలీసులకు మాత్రం సవాల్ ఎదురైంది. సాధారణంగా తమ స్టైల్లో వెళ్లిన  రాజస్థాన్‌ వెళ్లిన పోలీసులు దోంగ గురించి విచారణ చేశారు..ఎక్కడ ఎప్పుడు ఉంటాడో వివరాలు సేకరించారు. ఇక తమకు దొరికాడని భావించేలోపే దోంగ, పోలీసులకు ఓ ట్విస్ట్ ఇచ్చాడు...

పోలీసులకు బదులుగా దోంగే  ముందుగా  పోలీసులకు ఫోన్ చేశాడు... అనంతరం ''సార్‌ నమస్తే అంటూ.. మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు. హైదరాబాద్‌ నుంచి ఏ ట్రైన్‌లో వచ్చింది వివరించాడు... దీంతోపాటు మా రాష్ట్రంలో ఫలానా చోట దిగి.. ఆరా తీస్తూ నా ఆచూకీ గుర్తించారు. ఇందుకు మీరు చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్‌. ..అంటూనే.. నేను దోరుకుతానని మాత్రం నమ్మకం పెట్టుకోవద్దు అంటూ హితవు పలికాడు..ఇక తాను కొట్టేసిన కారు ఆచూకీ కూడా.. దయతో చెబితే తప్ప మీరు తెలుసుకోలేరు అంటూ భారీ సినిమా డైలాగులు కొట్టి సవాల్ విసిరాడు...

దీంతోపాటు ఎలాగూ ఇంత దూరం వచ్చారు కాబట్టి మీరున్న చోటు నుండి కొద్ది దూరంలో మంచి హోటల్‌ ఉంటుంది... అక్కడ ఫుడ్‌ కూడా మంచిగా ఉంటుంది.. కుడుపు నిండా తిని వెళ్లండి అంటూ అతిధి మర్యాదలు సైతం చెప్పాడు... రాజస్థాన్ ‌కు తనను పట్టుకునేందుకు వచ్చినందుకు బహుమానంగా అతిథులుగా భావించి బిల్లు కూడా తానే కడతానంటూ...ఫోన్‌లో వివరించినట్టు తెలుస్తోంది.

అయితే దొంగ మాటలను కొట్టి పారేసిన పోలీసులు  రాజస్థాన్‌లో ఆరు రోజులు ఉన్నా దోంగ మాత్రం మాత్రం చెప్పినట్టుగానే  చిక్కలేదు...దీంతో పోలీసులు వెనుదిరిగి వచ్చేశారు.. అయితే అదే దొంగ మరో ట్విస్ట్ కూడా  ఇచ్చాడు. ఫోన్‌ చేసిన నాలుగు రోజుల తర్వాత ఓ పోలీసు అధికారికి వీడియో కాల్ సైతం చేశాడట..అప్పుడు కూడా ఇలాగే సినిమా డైలాగ్‌లు వినిపించాడు.. నేను వీడియో కాల్ చేస్తున్నా...అవసరమైతే నా స్క్రీన్ షాట్ తీసుకోండి..మళ్లి మీకు నేను కనపడను అని చెప్పాడు. దీంతో పాటు కారును తాను ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తానని వాడుకున్న తర్వాత దాన్ని ఏదో ఓ చోట వదిలి వేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది...

అయితే పోలీసులు మాత్రం దోంగను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే వారికి కితాబు కూడా ఇచ్చాడు.. తాను ఇప్పటి వరకు మొత్తం 50 నుండి 60 కార్ల వరకు దొంగిలించానని అయితే.. తనను వెతుకున్నవారిలో హైదరాబాద్ పోలీసులు ముందు ఉన్నారని కూడా కితాబు ఇచ్చినట్టుగా సమాచారం.. దీంతో దోంగ వ్యవహర శైలితో పోలీసులే షాక్ అయినట్టు వార్త కథనాలు వెలువడ్డాయి..

ఇక మరోవైపు కారును పోగొట్టుకున్న బెంగళూరుకు చెందిన నిర్మాత మాత్రం తన కారు పోతే పోయింది.. అందులో విలువైన ఆస్తి ధృవపత్రాలు ఉన్నాయని మొత్తుకున్నట్టుగా తెలుస్తోంది..అయితే పోలీసులు మాత్రం దోంగను పట్టుకునేందుకు తమ ప్రయాత్నాలను మాత్రం విరమించలేదని చెబుతున్నారు...దీంతో ఎప్పటికైనా దొంగ దొరకకుండా ఉండడనే దీమాతో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.
Published by:yveerash yveerash
First published:

Tags: Crime news, Hydarabad, Telangana Police

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు