హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: మునుగోడులో 25 వేల ఓట్ల టెన్షన్..అసలెన్ని? బోగస్ ఎన్ని? హైకోర్టు ఏమన్నదంటే..

Munugodu: మునుగోడులో 25 వేల ఓట్ల టెన్షన్..అసలెన్ని? బోగస్ ఎన్ని? హైకోర్టు ఏమన్నదంటే..

తెలంగాణలోని మునుగోడు బైపోల్ రోజురోజుకు రసవత్తరంగా మారాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోడానికి నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఇక మునుగోడులో ఓట్ల నమోదు ప్రక్రియపై గందరగోళం నెలకొంది.

తెలంగాణలోని మునుగోడు బైపోల్ రోజురోజుకు రసవత్తరంగా మారాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోడానికి నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఇక మునుగోడులో ఓట్ల నమోదు ప్రక్రియపై గందరగోళం నెలకొంది.

తెలంగాణలోని మునుగోడు బైపోల్ రోజురోజుకు రసవత్తరంగా మారాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోడానికి నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఇక మునుగోడులో ఓట్ల నమోదు ప్రక్రియపై గందరగోళం నెలకొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలోని మునుగోడు (Munugodu) బైపోల్ రోజురోజుకు రసవత్తరంగా మారాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోడానికి నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఇక మునుగోడులో (Munugodu) ఓట్ల నమోదు ప్రక్రియపై గందరగోళం నెలకొంది. కేవలం 3 నెలల్లోనే 25 వేల కొత్త ఓట్లు నమోదుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కొత్తగా నమోదైన 25 వేలలో 7 వేల ఓట్లను తొలగించినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. అలాగే కొత్తగా నమోదు చేసుకున్న 25 వేల ఓట్లను నిశితంగా పరిశీలించే యాక్సెప్ట్ చేశారా? దీనికి సంబందించి ఓటర్ల జాబితా సమర్పించాలని, అలాగే పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

మునుగోడులో (Munugodu) ఓట్ల నమోదు ప్రక్రియపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. టీఆర్ఎస్ గెలవాలని కుట్ర పన్నుతోంది.. అందులో భాగంగానే నకిలీ ఓటర్లను సిద్ధం చేసిందని ఆరోపిస్తుంది. నకిలీ ఓట్లను (Fake Votes) టీఆర్ఎస్ పుట్టించిందని బీజేపీ ఆరోపిస్తుండగా..టిఆర్ఎస్, బీజేపీ కలిసే నకిలీ ఓటర్లను (Fake Votes) రంగంలోకి దింపినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. మునుగోడులో (Munugodu) బోగస్ ఓట్లను ఏరివేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై తాజాగా హైకోర్టును ఆశ్రయించింది.

Munugode Bypolls: మంత్రిని కూడా వదల్లేదు.. మునుగోడులో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

కాగా మునుగోడు (Munugodu) ఉపఎన్నిక నేపథ్యంలో బోగస్ ఓట్లు (Fake Votes) చేరడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుంది. ఆగష్టు 1వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు 24,881 మంది కొత్తగా ఓటు హక్కుకు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. అధికారులు నేరుగా దరఖాస్తుదారుని ఇంటికెళ్లి అన్ని వివరాలను పకడ్బందీగా తెలుసుకుంటున్నారు. ఆయా దరఖాస్తుదారులకు అక్కడ ఇల్లు లేకున్నా, స్థానికులు కాదని తెలిసిన వాటిని తిరస్కరిస్తున్నారు.

తెలంగాణలో నిర్వహించబోయే మునుగోడు ఉపఎన్నికను ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో దిగుతుండగా ...కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పోటీలో నిలిచారు. ఇక తెలంగాణలో అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్‌ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఖరారు చేసింది.

ఉపఎన్నిక షెడ్యూల్ ఇదే..

అక్టోబర్‌ 14వ తేది నామినేషన్ల స్వీకరణకు చివరి గడువుగా ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వ తేది వరకు గడువు ఉంది. ఇక ఉపఎన్నిక పోలింగ్‌ నవంబర్‌ 3న (November 3) ఉండగా కౌంటింగ్ 6వ (November6) తేదిన నిర్వహించనున్నట్లుగా ఎన్నికల సంఘం(Election Commission) వెల్లడించింది. మరి మునుగోడు ఓటర్ల నాడి ఎలా ఉందో ఫలితం తర్వాత తేలనుంది.

First published:

Tags: Munugodu, Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు