తెలంగాణలో 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.

Suresh Rachamalla | news18-telugu
Updated: March 12, 2019, 6:22 AM IST
తెలంగాణలో 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
  • Share this:
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని.. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (TSDPS) ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో భాగంగా.. ఆదివారం గరిష్ఠంగా నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలు చోట్ల 39.3, జగిత్యాలలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాకుండా.. వనపర్తి తదితర చోట్ల 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా 39 డిగ్రీలు నమోదయ్యాయి.. అంతేకాకుండా మెదక్‌లో సాధారణం కన్న రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో 37 డిగ్రీలు నమోదయ్యాయి. భద్రాచలం, ఖమ్మం పట్టణాల్లో శనివారం రాత్రిపూట సాధారణాన్ని మించి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. కాగా..వేసవి కారణంగా.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ శాస్త్రవేత్త నాగరత్న వెల్లడించారు.

అదిరిపోయిన పూజ హెగ్డే లేటెస్ట్‌ హాట్ ఫోటోస్

Published by: Suresh Rachamalla
First published: March 12, 2019, 6:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading