హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking: రేపటి నుంచి స్కూళ్లు తప్పనిసరి కాదు.. తెలంగాణ హైకోర్టు ఆర్డర్

Breaking: రేపటి నుంచి స్కూళ్లు తప్పనిసరి కాదు.. తెలంగాణ హైకోర్టు ఆర్డర్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Breaking: తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి స్కూళ్లు తెరవాలని తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు సంచలన ప్రకటన చేసింది.

Breaking: తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలను తప్పనిసరిగా తెరవాలని (schools reopen) తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా... స్కూళ్లు తెరవడం తప్పనిసరి కాదు అని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఆదేశంపై వారం పాటూ స్టే (Stay) విధించింది. కేజీ నుంచి ఇంటర్ వరకూ... ప్రభుత్వ స్కూళ్లు లేదా ప్రైవేట్ స్కూళ్లు ఎందులోనైనా సరే... సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులు తప్పనిసరిగా (Not Mandatory) స్కూళ్లలో క్లాసులకు వెళ్లాల్సిన అవసరం లేదు అని హైకోర్టు తెలిపింది. ఎవరూ విద్యార్థులను అలా బలవంత పెట్టకూడదని స్పష్టం చేసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో కీలక అంశాలు:

తెలంగాణ హైకోర్టు విద్యాసంస్థలకు ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యక్ష విద్యాబోధనకు రావాల్సిందిగా విద్యార్థులను బలవంతపెట్టవద్దని చెప్పింది. లైవ్ క్లాసులకు రాని విద్యార్థులపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు అని చెప్పింది. అలాగే లైవ్ క్లాసులు జరపని విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు అని ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. విద్యాసంస్థలు... తాము ఆన్‌లైన్ క్లాసులు చెప్పాలా లేక లైవ్ క్లాసులు చెప్పాలా అనేది అవే నిర్ణయించుకుంటాయి అని తెలిపింది. లైవ్ క్లాసులు చెప్పాలి అనుకునే స్కూళ్లకు సంబంధించి గైడ్‌లైన్స్ తప్పనిసరిగా జారీ చెయ్యాలి అని విద్యాశాఖకు ఆదేశం ఇచ్చింది హైకోర్టు. వారంలోగా ఈ గైడ్‌లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గైడ్‌లైన్స్ పాటిస్తున్నట్లుగా స్కూళ్లు ప్రచారం చెయ్యాల్సి ఉంటుంది. గురుకులాలు, హాస్టళ్లలో డైరెక్టు టీచింగ్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. విద్యాసంస్థలు, గురుకులాలలోని హైస్టళ్లు తెరవవద్దు అని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో ఫెసిలిటీస్‌పై ఓ రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. డైరెక్టు టీచింగ్ వల్ల ప్రయోజనాలతోపాటూ నష్టాలూ ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.

హైకోర్టు ఆదేశాన్ని బట్టీ... ఇప్పుడు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపాలా లేదా అన్నది తల్లిదండ్రులు (Parents) ఆలోచించుకునే అవకాశం వచ్చినట్లే. హైకోర్టు ప్రభుత్వ ఆదేశంపై స్టే విధించడం వల్ల ఇప్పుడు తెలంగాణ (Telangana)లోని ప్రభుత్వ స్కూళ్లు లేదా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఏవైనా సరే... పిల్లల్ని బలవంతంగా స్కూళ్లకు పంపమని డిమాండ్ చేసే, బలవంతం చేసే ఛాన్స్ లేదు. కాబట్టి తమ పిల్లల్ని పంపాలి అని అనుకుంటే తల్లిదండ్రులు పంపుకుంటారు, వద్దు అనుకుంటే ఆన్‌లైన్‌ క్లాసులు (Online Classes) చదివించుకుంటారు. హైకోర్టు వారం పాటూ స్టే విధించింది కాబట్టి వారం తర్వాత మళ్లీ ఈ అంశంపై విచారణ జరిపే అవకాశం ఉంది.

తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. ఇదివరకు ఒక్క హైదరాబాద్‌లోనే 500 కొత్త కేసులు వచ్చేవి... ఇప్పుడు మొత్తం రాష్ట్రమంతా చూసినా 400 కంటే తక్కువ కేసులే వస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు  ప్రారంభించాలని అనుకుంది. దానికి తోడు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉండటం వల్ల స్కూళ్లు తెరవడమే మంచిదని భావించింది. అందువల్ల సెప్టెంబర్ 1 నుంచి తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల్ని స్కూళ్లకు పంపాలని కండీషన్ పెట్టింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో... హైకోర్టు ఈ స్టే విధించింది.

ఇది కూడా చదవండి: పాపం.. కుక్కర్‌లో ఇరుక్కుపోయిన పిల్లాడి తల.. చివరకు ఏమైందో తెలుసా?

ప్రభుత్వం చెప్పడమైతే చెప్పింది కానీ... స్కూళ్లలో కరోనా జాగ్రత్తలు ఎంతవరకూ తీసుకుంటున్నారనే అంశం సమస్యగా మారింది. ప్రభుత్వమేమో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని చెబుతున్నా... తల్లిదండ్రుల్లో భయాల్ని మాత్రం పోగొట్టలేకపోయింది. ఈ తర్జనభర్జన సమయంలో... హైకోర్టు ఆదేశం... పేరెంట్స్‌కి ఒకింత ఉపశమనం లాంటిదే. పిల్లల్ని పంపాలి అనుకునేవారు పంపుకుంటారు. వద్దనుకునేవారు... ఆన్‌లైన్ క్లాసులనే కంటిన్యూ చేసుకుంటారు. వారం తర్వాత వచ్చే తీర్పును బట్టీ తదుపరి ప్రభుత్వ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి.

First published:

ఉత్తమ కథలు