తెలంగాణ (Telangana) ప్రజలకు TRS ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు (ration cards holders) ఆగస్టు నెల కోటాలో భాగంగా ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యాన్ని ఉచితంగా (Free Ration) పంపిణీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వాధికారులు ప్రకటన వెల్లడించారు. గురువారం నుంచే బియ్యం అందిస్తామని తెలిపింది. అయితే.. కరోనా కారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేసేందుకు (Ration Rice) ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ కోటాను ప్రజలకు అందించలేదు.
కాగా, తెలంగాణ (Telangana)లో రేషన్‌కార్డులు (Ration cards) రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్‌కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల ఆధారంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించి.. అర్హులని తేలితే రేషన్‌కార్డులను పునరుద్ధరి స్తారు (Restore). రేషన్‌కార్డుల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఈ చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి వెరిఫికేషన్ (Ground level verification) 15 రోజుల కిందటే మొదలైంది. ఈ ప్రక్రియ పూర్తవగానే రేషన్ కార్డులు అందజేయనున్నారు. కాగా, ఆగస్టు నెల చివర్లో కొత్త రేషన్‌కార్డులు వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తరఫున ఉచితంగా అందిచాల్సిన బియ్యాన్నీ ఇవ్వకుండా కిలోకు రూపాయి చొప్పున 6 కిలోలు పంపిణీ చేసింది. ఏప్రిల్, మే నెలల్లో ఉచితంగా పంపిణీ చేయని కారణంగా జులై నెలలో ఒక్కొక్కరికి 10 కిలోలు అందించారు. కాగా.. ఆగస్టు నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం అందించేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యారు. పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం 15 రోజులపాటు కొనసాగి ఈ నెల 19న ముగియనుంది. అయితే ఆగస్టులోనే కాకుండా సెప్టెంబరులోనూ బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు.
సకాలంలో స్పందించకపోవటంతో..
లబ్దిదారులు బియ్యాన్ని ఎక్కడా విక్రయించవద్దని కోరారు. సాధారణ రోజుల్లో ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ నెలలో 15 కిలోల అందిచనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ద్వారా మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవటంతో యథావిధిగా బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే.. తాజాగా ఆగస్టులో ఫ్రీగా ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 87.43 లక్షల మంది రేషన్కార్డుదారులకు ప్రయోజనం కలగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Free Ration, Telangana ration card