Home /News /telangana /

THE TELANGANA GOVERNMENT ONCE AGAIN DID NOT FOLLOW THE PROTOCOL DURING GOVERNOR TAMILISAI BASARA IIIT VISIT ADB PRV

Basara IIIT: ప్రభుత్వం వర్సెస్​ గవర్నర్​.. బాసర ఐఐఐటీలో తమిళిసైకి మళ్లీ అవమానం..!

గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

వరుస ఆందోళనలతో అట్టుడికిపోతున్న నిర్మల్ జిల్లా బాసర లోని ట్రిపుల్ ఐటిని ఆదివారం గవర్నర్ సందర్శించారు. అయితే ఈ పర్యటనలో ప్రభుత్వం తరఫున ప్రొటోకాల్​ ఉల్లంఘనలు మళ్లీ జరిగాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (Katta Lenin, News18, adilabad)

    బాసర ట్రిపుల్ఐటి ( Basara IIIT) చాలా సమస్యలు ఉన్నాయని, అందులో కొన్ని ప్రాథమిక సమస్యలను గుర్తించానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వెల్లడించారు. ట్రిపుల్ ఐటి లోని సమస్యల పరిష్కారం కోసం తన పరిధిలో ప్రయత్నం చేస్తానని హామి ఇచ్చారు. వరుస ఆందోళనలతో అట్టుడికిపోతున్న నిర్మల్ జిల్లా బాసర లోని ట్రిపుల్ ఐటిని ఆదివారం గవర్నర్ సందర్శించారు. అంతకుముందు బాసర లోని సుప్రసిద్ద సరస్వతీ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రిపుల్ ఐటికి ( Basara IIIT) చేరుకొని విద్యార్థులతో  కలసి ముచ్చటిస్తూ అల్పాహారం చేశారు. ఆ తర్వాత బాలికల, బాలుర  వసతి గృహాలను,  భోజనశాల లను సందర్శించారు.  ప్రతీ గదిని పరిశీలించి విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పరిపాలన భవనం ఎదురుగా మొక్కలు నాటి  విద్యార్థులతో ఫోటోలు దిగారు. ట్రిపుల్ సందర్శన అనంతరం గవర్నర్ గేటు బయట మీడియాతో మాట్లాడారు.

    Mulugu: పరీక్ష రాసింది ఒక్కడు.. రాయించింది మాత్రం ఎనిమిది మంది ప్రభుత్వోద్యోగులు

    గవర్నర్ తమిళిసై  పర్యటనలో అధికారులు, నాయకులు ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూకీ, ఎస్. పి ప్రవీణ్ కుమార్ గవర్నర్ పర్యటనలో కనిపించకపోవడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది. ట్రిపుల్ ఐటి పర్యటన అనంతరం గవర్నర్ గేటు బయట మీడియా తో మాట్లాడటం కూడా పలు అనుమానాలను రేకెత్తించింది. ఎప్పటి మాదిరిగానే ట్రిపుల్ ఐటి  ( Basara IIIT) అధికారులు గవర్నర్ పర్యటన సందర్భంగా కూడా మీడియా పై ఆంక్షలు విధించారు.



    ఒక గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా సరిగా లేదని తమిళసై ఈ సందర్భంగా వాపోయారు. అయితే దీన్ని ఎత్తిచూపడం తనకి ఇష్టం లేదని, తాను రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదని,  విద్యార్థుల కోసం వచ్చానని రాష్ట్ర గవర్నర్  తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. క్యాంపస్ లో విద్యార్థులపై పోలీసు ఆంక్షలు సరికాదని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

    కనిపించని మంత్రి, ఎమ్మెల్యే..

    హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు రైలు లో వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై  సౌందరరాజన్  తెల్లవారుజామున  అక్కడి నుండి రోడ్డు మార్గంలో బాసర చేరుకున్నారు.  అదనపు కలెక్టర్  పి. రాంబాబు,  ట్రిపుల్ ఐటి ఇంచార్జి ఉప కులపతి, వెంకటరమణ,  సంచాలకులు సతీష్ కుమార్, డీఎస్పి జీవన్ రెడ్డి, ఆర్డీఓ లోకేష్, రెడ్ క్రాస్ సొసైటి సభ్యులు గవర్నర్ కు స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ శాసనసభ్యుడు జి. విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ, ఎస్.పి ప్రవీణ్ కుమార్ లు గవర్నర్ పర్యటనకు దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Basara IIIT, Governor Tamilisai, Protocol

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు