హోమ్ /వార్తలు /తెలంగాణ /

Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామయాత్రలో ఉద్రిక్తతలు.. హైకోర్టుకెక్కిన తెలంగాణ ప్రభుత్వం

Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామయాత్రలో ఉద్రిక్తతలు.. హైకోర్టుకెక్కిన తెలంగాణ ప్రభుత్వం

బండి సంజయ్, కేసీఆర్

బండి సంజయ్, కేసీఆర్

బీజేపీ చీఫ్​ బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర (Bandi Sanjay Praja Sangrama Yatra) నిలిపివేయడానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సర్వ శక్తులూ ఒడ్డుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  బీజేపీ చీఫ్​ బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర (Bandi Sanjay Praja Sangrama Yatra) నిలిపివేయడానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ఇప్పటికీ ఓ దఫా పాదయాత్రను అడ్డుకున్న సంగతి తెలిసిందే. శాంతి భద్రతల సమస్య అంటూ పోలీసులు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి రద్దు చేశారు. జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నందున పాదయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు పంపారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ బీజేపీ (BJP) నేతలు ఈ నెల 23 సాయంత్రం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు  (High Court) నిన్న కీలక ఆదేశాలు ఇచ్చింది. వర్ధన్నపేట ఏసీపీ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. ఇవాళ ఉదయం నుండి బండి సంజయ్ యాత్రను పున: ప్రారంభించారు. రేపు భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద యాత్రను ముగించనున్నారు బండి సంజయ్.


  అయితే బండి సంజయ్ పాద యాత్రలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బండిసంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్ఎస్ (TRS) కార్యకర్తల నినాదాలతో జనగామ జిల్లాలో ఉద్రికత్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు (Police) అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేసేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించారు. దీంతో కొందరికి స్వల్పగాయాలు అయ్యాయి.  బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలో చేరుకోగానే ఒక్కసారిగా కార్యకర్తలు నినాదాలు హోరెత్తాయి. బీజేపీ, టీఆర్ఎస్ (TRS) కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కర్రెలతో దాడికి బీజేపీ ప్రయత్నించగా ఉద్రికత్త నెలకొంది. దీంతో పోలీసులు లాఠాచార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.


  Munugodu: ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన నిర్ణయం.. వివరాలివే


  అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. బండి సంజయ్ పాదయాత్రపై గురువారం తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో తెలంగాణ సర్కార్  (Telangana Government)పిటిషన్ దాఖలు చేసింది. బండిసంజయ్ పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ సర్కార్ ఆ పిటిషన్ లో పేర్కొంది.ఈ పిటిసన్ ను అత్యవసరంగా విచారించాలని కోరింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 1 గంట తర్వాత విచారణను తెలంగాణ హైకోర్టు చేపట్టింది అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిసన్ పై విచారణను సోమవారం నాడు చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bandi sanjay, High Court, Telangana bjp, Telangana Government

  ఉత్తమ కథలు