హోమ్ /వార్తలు /తెలంగాణ /

New Ration cards: తెలంగాణ ప్రజలకు గుడ్​న్యూస్​.. కొత్త రేషన్​ కార్డులు ఇవ్వడానికి కసరత్తులు.. పూర్తి వివరాలివే..

New Ration cards: తెలంగాణ ప్రజలకు గుడ్​న్యూస్​.. కొత్త రేషన్​ కార్డులు ఇవ్వడానికి కసరత్తులు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

తెలంగాణలో రేషన్‌కార్డులు రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్‌కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.

    తెలంగాణ (Telangana)లో రేషన్‌కార్డులు (Ration cards) రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్‌కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల ఆధారంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించి.. అర్హులని తేలితే రేషన్‌కార్డులను పునరుద్ధరి స్తారు (Restore). రేషన్‌కార్డుల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఈ చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ (Ground level verification) మంగళవారమే మొదలైందని.. ఈ నెల 20 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

    చనిపోయిన వారు, ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు, ఆధార్ సంఖ్య రెండు సార్లు నమోదైన వారు, గ్రామంలో లేకుండా పూర్తిగా వెళ్లిపోయినవారు, నిబంధనలకు మించి భూములు కలిగిఉన్నవారు తదితర కారణాలతో కార్డులను గతంలో రద్దు చేశారు. అయితే వారికి పలానా కారణంగా కార్డు రద్దు చేస్తున్నామనే నోటీసులు జారీ చేయకపోవడంతో ప్రస్తుతం మళ్లీ విచారించి నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది.

    అర్హులను ఎలా నిర్ణయిస్తారంటే..?

    రాష్ట్రంలో గతలో రద్దయిన రేషన్‌ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం కోసం వారి డేటాను రేషన్‌షాపుల నుంచి సేకరించనున్నారు. ఆ జాబితాలను అన్ని రేషన్‌షాపులు (ration shops), గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలి. రద్దయిన కార్డుదారులకు సంబంధించి తనిఖీ అధికారి సంప్రదించలేని, గుర్తించలేని వారికి నోటీసులను వారి చిరునామాకు పోస్ట్‌ చేయాలి, ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించాలి.  రీవెరిఫికేషన్‌పై స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారం చేయాలి. ఎవరైనా తిరిగి రేషన్‌కార్డు పొందేందుకు అర్హులని తేలితే.. వెంటనే ఆ వివరాలను నమోదు చేయాలి. రద్దు చేయబడిన కార్డు (Ration card)కు సంబంధించిన కారణాలను కూడా నమోదు చేయాలి.

    రేషన్​ కార్డుతో ఉపయోగాలు..


    • పౌరులు రేషన్ దుకాణం నుంచి తక్కువ ధరలకు ఆహార సరఫరాలను పొందవచ్చు.

    • రేషన్ కార్డ్ ప్రభుత్వంచే జారీ చేయబడినందున, ఇది భారతదేశం అంతటా అధికారిక గుర్తింపు యొక్క గుర్తింపు పొందిన రూపం.

    • కొత్త ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు.

    • ఫోన్ సిమ్ కార్డు కొనుగోలు చేసేటప్పుడు కూడా రేషన్ కార్డు ఉపయోగపడుతుంది.

    • చెల్లించేటప్పుడు రేషన్ కార్డులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి సరైన ఆదాయపు పన్ను రేట్లు.

    • పాన్ కార్డు కోసం ఫైల్ చేసేటప్పుడు, రేషన్ కార్డును గుర్తింపుగా ఉపయోగించవచ్చు.

    • బ్యాంక్ ఖాతాను సృష్టించడానికి మరియు బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బును బదిలీ చేయడానికి, ఇది గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది.

    • పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డును ఉపయోగించవచ్చు.

    • కొత్త LPG లైన్‌ను పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

    • పౌరుడు జీవిత బీమా పొందవచ్చు.

    • డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు పౌరులు రేషన్ కార్డును ఉపయోగించవచ్చు.

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ration cards, Telangana Ration card holders

    ఉత్తమ కథలు