Home /News /telangana /

THE TELANGANA GOVERNMENT HAS TAKEN A DECISION TO APPLY THE MEDICAL TREATMENTS PROVIDED UNDER AROGYASRI TO FOOD SECURITY CARDS AS WELL PRV

Arogya sri: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్​కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ.. వివరాలివే

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలను ఆహార భద్రత కార్డులకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఆరోగ్య శ్రీ (Arogya Sri) సులభతరంగా వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహారభద్రత కార్డుపై (Food security card) కూడా చెల్లుబాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెల్లరేషన్‌ కార్డు (Ration card) ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కోసం తెల్లకార్డుల స్థానంలో 10 లక్షల ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసింది. రాష్ట్రంలో సుమారు 77 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి

    వాటిని కేవలం రేషన్‌ సరుకుల కోసం మాత్రమే పరిమితం చేసింది. ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డుగానీ, లేదా తెల్ల రేషన్‌ కార్డుగానీ ఉండాలనే నిబంధన ఉంది. దీనివల్ల ఆహార భద్రత కార్డుదారులు ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రజల నుంచి వినతులు రావడంతో.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఇక నుంచి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఉచిత సేవలు లభిస్తాయి.

    Gram panchayats: గ్రామపంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​న్యూస్​.. పూర్తి వివరాలివే

    తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఏప్రిల్‌ తర్వాత అమల్లోకి తెస్తామని అప్పట్లో తెలిపింది. ఈ పథకం ద్వారా 26 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ కింద 84 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారని పేర్కొంది. కేంద్ర పథకం ద్వారా వచ్చే నిధులు తక్కువేనని వెల్లడించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల వైద్య పథకాల కోసం ఏడాదికి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించింది.


    2007 ఏప్రిల్ 1 న..

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చింది. ఇది ప్రజా ఆరోగ్య కార్యక్రమం. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు. ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు దక్కించుకుంది. ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు.

    ఆరోగ్య శ్రీ కార్డు పొందాలని భావించే వారు సులభంగానే పొందొచ్చు. దగ్గరిలోని గ్రామ సచివాలయానికి వెళ్లి ఆరోగ్య శ్రీ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఆరోగ్య శ్రీ కార్డు పొందాలంటే కొన్ని డాక్యుమెంట్లు కచ్చితంగా ఉండాల్సిందే. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ఆరోగ్య శ్రీ కార్డు కోసం ఫ్యామిలీ ఫోటో తప్పనిసరిగా ఉండాలి. అలాగే రేషన్ కార్డు కూడా కావాల్సిందే. అలాగే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అందించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ సర్టిఫికెట్ కూడా తీసుకొని పెట్టుకోండి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Aarogyasri, CM KCR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు