హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ind vs Aus: నేడు హైదరాబాద్​లో భారత్​, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​..స్టేడియానికి ఇలా వెళితే తొందరగా చేరుకోవచ్చు..

Ind vs Aus: నేడు హైదరాబాద్​లో భారత్​, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​..స్టేడియానికి ఇలా వెళితే తొందరగా చేరుకోవచ్చు..

PC : TWITTER

PC : TWITTER

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  భారత్, ఆస్ట్రేలియా (Ind vs Aus) జట్ల మధ్య జరుగుతున్న టీ20 (T20) సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల కోసం తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఇక వివాదాలన్నింటినీ పక్కనపెట్టేసి 25న జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

  ప్రత్యేక ఆర్టీసీ బస్సులు..

  భారత్​ క్రికెట్ మ్యాచ్ (Cricket match) సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని 24 ప్రదేశాల నుంచి ఉప్పల్ స్టేడియానికి  (Uppal stadium) ఆర్టీసీ బస్సులను నడిపించనున్నారు. ఉప్పల్ రూట్, ఘట్కేసర్-రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బిహెచ్.ఈఎల్ (BHEL), జీడిమెట్ల, కెపిహెచ్బి, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఈసిఐఎల్ క్రాస్ రోడ్స్, హయత్ నగర్, ఏన్.జి.ఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోటి, దిల్ సుఖ్​ నగర్, ఆఫ్జల్ గంజ్, మెహదీపట్నం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం,యూసఫ్ గూడ, బోయిన్పల్లి, చార్మినార్, చంద్రయానగుట్ట, కొండాపూర్ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

  ఈ రూట్లలో వెళితే..

  క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌ లో రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లే రహదారులపై భారీ వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. తార్నాక మీదుగా వచ్చే వీఐపీ వాహనాలు హబ్సీగూడ, ఎన్జీఆర్ఐ, ఏక్ మినార్ వద్ద కుడి వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకొని వాహనాలను ఏ, సీ ల వద్ద నిలపాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

  అంబర్ పేట్ వైపు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు దూరదర్శన్, రామాంతపూర్, స్ట్రీట్ నెంబర్ 8 వద్ద ఎడమ వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్ద దిగి వాహనాలను పార్కింగ్ ఏ, సీ ల వద్ద నిలపాలని సూచిస్తున్నారు. నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ వాహనాలు ఉప్పల్ చౌరస్తా, సర్వే ఆఫ్ ఇండియా, ఏక్ మినార్ వద్ద ఎడమ వైపు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

  స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించారు. వాహనాలను స్డేడియానికి ఎడమ వైపున పార్కింగ్-బీలో నిలపాల్సి ఉంటుంది. స్టేడియానికి వచ్చేందుకు ప్రత్యేక పాసులు కలిగి ఉన్న వాళ్లకి పాత ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. స్టేడియం మెట్రో స్టేషన్‌ నుంచి ఒంటి గంటవరకు ప్రత్యేక రైళ్లు నడపనుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Cricket news, Hyderabad, IND vs AUS, T20

  ఉత్తమ కథలు